న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కాళ్లు పట్టుకుని వదల్లేని అభిమానిని గుండెకు హత్తుకున్న ధోనీ

హైదరాబాద్: ధోనీ అంటే అభిమానం దేశం దాటి ప్రపంచ స్థాయికి చేరింది. అలాంటి పరిస్థితుల్లో ఓ యువ క్రికెటర్ ధోనీ చేతుల మీదుగా బహుమతి అందుకోబోతుంటే ఎంతటి ఉద్వేగానికి లోనవుతాడు. అలాంటి సంఘటనే న్యూ ఢిల్లీలోని ఓ తాజా కార్యక్రమానికి హాజరైన ధోనీకి తారసపడింది. అతని కాళ్లు పట్టుకుని వెళ్లనంటూ మారం చేస్తున్న అభిమానిని చివరికి భద్రతా సిబ్బంది పక్కకి తప్పించారు.

న్యూఢిల్లీలో తాజాగా జరిగిన ఓ కార్యక్రమానికి మహేంద్రసింగ్ ధోనీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా నిర్వాహకులు.. క్రికెట్‌లో విశేష ప్రతిభ కనబర్చిన ఓ కుర్రాడికి ధోనీ చేతుల మీదుగా బహుమతి ప్రదానం చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా.. ఆ యువ క్రికెటర్‌ని వేదికపైకి పిలవగా.. తన ఆరాధ్య క్రికెటర్‌ని కలవబోతున్నాననే భావోద్వేగంతో వచ్చిన కుర్రాడు.. నేరుగా వెళ్లి వేదికపై ఉన్న మహేంద్రసింగ్ ధోనీ కాళ్లపై పడిపోయాడు.

ఆ సమయంలో కుర్రాడికి బహూకరించనున్న చిన్న బ్యాట్‌పై సంతకం చేస్తున్న ధోనీ.. వెంటనే అతడ్ని పైకిలేపి.. హత్తుకున్నాడు. అనంతరం ధోనీ ఓ ఫోన్‌ని బహూకరించగా.. దానితో సెల్ఫీ తీసుకుని.. అనంతరం సంతకం చేసిన బ్యాట్‌ని అందుకున్నాడు.

ఆ తర్వాత కూడా ధోనీని వదిలి వెళ్లలేక అక్కడే ఉండిపోతుండటంతో నిర్వాహకులు బలవంతంగా భద్రతా సిబ్బంది సహాయంతో కిందకి దింపేశారు. ఏడాది క్రితం ధోనీ మైదానంలో మ్యాచ్ ఆడుతుండగా.. ఓ అభిమాని సైతం భద్రతా సిబ్బంది కళ్లుగప్పి నేరుగా వెళ్లి ఈ మహేంద్ర సింగ్ ధోనీ కాళ్లు పట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటన అప్పట్లో వైరల్ కూడా అయింది.

Story first published: Wednesday, March 21, 2018, 16:11 [IST]
Other articles published on Mar 21, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X