న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఒక పరుగు కోసం సుదీర్ఘ నిరీక్షణ: అప్పట్లో ద్రవిడ్‌... ఇప్పుడు స్టీవ్ స్మిత్ (వీడియో)

Watch: When SCG crowd hailed Rahul Dravid like Steve Smith for scoring single run

హైదరాబాద్: సిడ్నీ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న చివరిదైన మూడో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో స్టీవ్‌ స్మిత్‌ తొలి పరుగు చేయడానికి 39 బంతులు తీసుకున్నాడు. అంతేకాదు 45 నిమిషాల తర్వాత పరుగు చేసాడు. కివీస్ బౌలర్లు కట్టుదిట్టమైన బంతులు వేసినా.. సమర్ధంగా ఎదుర్కొని ఆ పరుగు సాధించడం విశేషం.

అన్ని బంతులు ఆడి సింగిల్‌ తీసిన స్మిత్‌ను ఆస్ట్రేలియా అభిమానులు ఆకాశానికెత్తారు. సిడ్నీ స్టేడియంలోని అభిమానులు లేచి మరీ స్మిత్‌ను చప్పట్లతో అభినందించారు. సాధారణంగా ఓ బ్యాట్స్‌మన్‌ సెంచరీ చేసిన తర్వాత అభిమానుల అభినందిస్తుంటారు. కానీ, అందుకు భిన్నంగా తొలి పరుగు తీసిన తర్వాత అతడిని చప్పట్లతో అభినందించారు.

మరోసారి వార్తల్లో నిలిచిన ద్రవిడ్

మరోసారి వార్తల్లో నిలిచిన ద్రవిడ్

ఈ వీడియో నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రవిడ్ మరోసారి వార్తల్లో నిలిచాడు. 2008లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో పరుగు చేయడానికి 40 బంతులు తీసుకున్నాడు. ద్రవిడ్‌ 18 పరుగులు చేసిన అనంతరం మరో పరుగు తీసేందుకు ఎక్కువ సమయం నిలిచాడు.

బ్రెట్‌ లీ వంటి ఫాస్ట్‌ బౌలర్లను

బ్రెట్‌ లీ వంటి ఫాస్ట్‌ బౌలర్లను

బ్రెట్‌ లీ వంటి ఫాస్ట్‌ బౌలర్ల ఔట్‌ స్వింగ్‌, ఇన్‌ స్వింగ్‌ బంతులను ఆచితూచి ఆడే క్రమంలో ద్రవిడ్‌కు సుదీర్ఘంగా నిరీక్షించాడు. 18 పరుగుల తర్వాత ఒక పరుగు తీసేందుకు సుదీర్ఘంగా నిరీక్షించాడు. దీంతో ద్రవిడ్‌కు అభిమానులు చప్పుట్లతో అభినందించారు. తాజాగా, స్మిత్‌ సింగిల్‌ తీయడానికి 39 బంతులు తీసుకున్న తర్వాత స్టేడియం దద్దరిల్లింది.

అప్పట్లో ద్రవిడ్‌కు లభించినట్లే స్మిత్‌కు

అప్పట్లో ద్రవిడ్‌కు ఏ తరహా అభినందన అయితే లభించిందో తొలిరోజు ఆటలో భాగంగా స్మిత్‌కు అదే తరహా అభినందన లభించింది. ఇందుకు సంబంధించిన వీడియోని క్రికెట్ ఆస్ట్రేలియా తన అధికారిక ట్విట్టర్‌లో పోస్టు చేసింది. అయితే, ఈ రెండు సందర్భాలు సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లోనే జరగడం విశేషం.

తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ 454 ఆలౌట్

తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ 454 ఆలౌట్

సిడ్నీలో న్యూజిలాండ్‌తో జ‌రుగుతున్న మూడ‌వ టెస్టులో మార్న‌స్ ల‌బుషేన్ డబుల్ సెంచరీతో చెలరేగడంతో టాస్ గెలిచి తొలు బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా త‌న తొలి ఇన్నింగ్స్‌లో 454 ప‌రుగుల‌కు ఆలౌటైంది. 283/3 ఓవర్‌నైట్‌ స్కోరుతో రెండో రోజైన శనివారం ఇన్నింగ్స్‌ను కొనసాగించిన లబుషేన్ 346 బంతుల్లో 19 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 215 పరుగులు చేశాడు.

Story first published: Saturday, January 4, 2020, 13:51 [IST]
Other articles published on Jan 4, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X