రోహిత్ శర్మ సిక్సర్: చూపు తిప్పుకోలేకపోయిన కోహ్లీ (వీడియో)
హైదరాబాద్: కాన్పూర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మూడో వన్డేలో భారత ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు సెంచరీలతో చెలరేగిన సంగతి తెలిసిందే. టాస్ ఓడి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా మ్యాచ్ ఆరంభం నుంచే కివీస్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొంది.
ఇక, ఓపెనర్ రోహిత్ శర్మ ఆరంభం నుంచి దూకుడుగా ఆడుతూ తన కెరీర్‌లో 15వ సెంచరీని నమోదు చేశాడు. 2015లో దక్షిణాఫ్రికాపై 150 పరుగులు చేసిన రోహిత్ అదే దూకుడును కివీస్‌పై కూడా కొనసాగించాడు. ఈ మ్యాచ్‌లో రెండు సిక్సర్లు బాదిన రోహిత్ శర్మ భారత్ తరఫున 150 సిక్సర్లు బాదిన ఐదో ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు.
గతంలో సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, మహేంద్ర సింగ్ ధోని, యువరాజ్ సింగ్‌లు మాత్రమే ఈ ఘనత సాధించారు. అయితే మూడో వన్డేలో కివీస్ బౌలర్ మిల్నే వేసిన ఇన్నింగ్స్ పదో ఓవర్లో బంతిని మిడ్ వికెట్ మీదుగా పుల్ చేసిన రోహిత్ బంతిని సిక్సుగా మలిచాడు.
రోహిత్ సిక్సుకి కోహ్లీ ఆశ్చర్యం
రోహిత్ చక్కటి టైమింగ్‌తో కొట్టిన ఈ సిక్సర్‌కు నాన్ స్ట్రయికర్ ఎండ్‌లో ఉన్న కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆశ్చర్యానికి లోనయ్యాడు. అద్భుతమైన షాట్ అంటూ అలాగే బంతిని చూస్తుండిపోయాడు. ఈ సిక్సర్‌తో టీమిండియా 50 పరుగుల స్కోరుని దాటింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

మూడో వన్డేలో భారత్ విజయం
ఇదిలా ఉంటే కాన్పూర్ వేదికగా జరిగిన మూడో వన్డేలో న్యూజిలాండ్‌పై 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరిస్‌ను 2-1తో భారత్ కైవసం చేసుకుంది. ఈ సిరిస్ విజయం భారత్‌కు వరుసగా ఏడో సిరిస్ విజయం కావడం విశేషం. 338 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ ఆరంభంలో దూకుడుగా ఆడినప్పటికీ చివర్లో తడబడింది.

చివరి ఓవర్‌లో బుమ్రా మ్యాజిక్
దీంతో నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 331 పరుగులు చేసింది. చివరి ఓవర్లో 15 పరుగులు సాధించాల్సిన దశలో బుమ్రా అద్భుతంగా బౌలింగ్ వేసి 9 పరుగులు మాత్రమే ఇచ్చి ఒక వికెట్ తీసి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. బుమ్రా ఇన్నింగ్స్ 47 ఓవర్లో ధోనితో చక్కటి సమన్వయంతో లాథమ్ (65)ను రనౌట్ చేయడంతో మ్యాచ్ భారత్ వైపు తిరిగింది. వాస్తవానికి కివీస్ జట్టు 40 ఓవర్లలో 247/3తో పటిష్టంగా కనిపించింది.

లాథమ్ ఔట్‌తో ఉత్కంఠగా మారిన మ్యాచ్
లాథమ్ క్రీజులో ఉన్నంత సేపు భారత్ విజయానికి దూరంగా ఉండిపోయింది. చివర్లో కివిస్ విజయానికి 13 బంతుల్లో 25 పరుగులు అవసరమైన దశలో అతడు రనౌట్ కావడంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. చివరి ఓవర్‌లో బుమ్రా మ్యాజిక్ చేయడంతో భారత్ 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. అంతకముందు టాస్ గెలిచిన భారత్ 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 337 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications