Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మరో కోహ్లి కమింగ్: విరాట్ (Video)

స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి తన గారాలపట్టి వామిక గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. తండ్రికి తగ్గట్లుగానే వామిక బ్యాటుతో ధనాధన్ షాట్లు ఆడుతుందని చెప్పాడు. ఆర్సీబీ ఇన్‌సైడర్ షోలో మిష్టర్ నాగ్స్ చేసిన ఇంటర్వ్యూలో కోహ్లి పాల్గొన్నాడు. నాగ్స్ ఎప్పటిలానే కోహ్లితో కలిసి షోనూ సందడిగా నడిపించాడు.

ఇంటర్వ్యూ ప్రారంభంలో కోహ్లిని నాగ్ ఆటపట్టించాడు. తను కామన్ మ్యాన్ అని, కామెంటేటర్ కాదని, తనతో స్నేహం చేస్తారా అని నాగ్ అడిగాడు. దీనికి కోహ్లి నవ్వు ఆపుకోలేకపోయాడు. ఇటీవల సునీల్ గవాస్కర్ వంటి వ్యాఖ్యాతలకు కోహ్లి ఘూటుగా బదులిచ్చిన విషయం తెలిసిందే. కోహ్లి స్టైక్‌రేటుపై వ్యాఖ్యాతలు చేసిన విమర్శలకు విరాట్ బ్యాటుతో పాటు మాటలతోనూ బదులిచ్చాడు. ఇది చర్చనీయాంశంగా మారింది. దీనిపై నాగ్స్ ఇండైరెక్ట్‌గా కోహ్లి‌ని సరదాగా ప్రశ్నించాడు.

Watch Virat Kohli Shares Family Moments Vamika Enjoys Swinging the Bat

భారత ఫుట్‌బాల్ దిగ్గజం సునీల్ ఛెత్రి రిటైర్మెంట్ గురించి కోహ్లి మాట్లాడాడు. ఛెత్రి తనని అత్యంత సన్నిహితుడని, రిటైర్మెంట్‌ను ప్రకటించే ముందు తనతో చెప్పాడని అన్నాడు. ''సునీల్ ఛెత్రి నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. రిటైర్మెంట్ ప్రకటించే ముందు నాతో ఆ విషయాన్ని చెప్పాడు. గత కొన్నేళ్లుగా మా స్నేహం కొనసాగుతోంది. అతను ఎంతో మంచి వ్యక్తి'' అని కోహ్లి పేర్కొన్నాడు. జూన్‌ 6న కువైట్‌తో జరిగే ప్రపంచకప్‌ అర్హత మ్యాచ్‌ అనంతరం రిటైర్‌కానున్నట్లు సునీల్ ఛెత్రి బుధవారం సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించిన విషయం తెలిసిందే.

ఫ్యామిలీ గురించి నాగ్స్ ప్రశ్నించగా కోహ్లి బదులిచ్చాడు. అందరూ బాగున్నారని చెప్పాడు. తన కూతురు వామిక గురించి ప్రత్యేకంగా మాట్లాడాడు. ''మా కూతురు బ్యాటు పట్టింది. బ్యాటును స్వింగ్ చేస్తూ ఎంజాయ్ చేస్తుంది. అయితే కెరీర్‌లో ఏం ఎంచుకోవానేది పూర్తిగా వామిక ఇష్టమే'' అని కోహ్లి అన్నాడు. దీనికి నాగ్ స్పందిస్తూ.. ఐపీఎల్‌లో విరాట్ కోహ్లి, ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో వామిక అని అన్నాడు. విరాట్ కోహ్లి-అనుష్క శర్మ‌కు ఇద్దరు సంతానం. కూతురు వామికకు మూడేళ్లు కాగా, కుమారుడు అయాన్ వయసు మూడు నెలలు. కుటుంబ విషయంలో కోహ్లి ఎంతో గోప్యంగా ఉంటాడు.

Story first published: Friday, May 17, 2024, 12:28 [IST]
Other articles published on May 17, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+