మిచెల్ స్టార్క్ ఔట్: పాటలు పాడుతూ.. స్టెప్‌లు వేసిన కోహ్లీ (వీడియో)


హైదరాబాద్: అడిలైడ్ ఓవల్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ చాలా ఉత్సాహంగా కనిపిస్తున్నాడు. ఆసీస్ గడ్డపై భారీ అంచనాల మధ్య తొలి ఇన్నింగ్స్‌లో అడుగుపెట్టిన విరాట్ కోహ్లీ (3) బ్యాట్‌తో విఫలమైనప్పటికీ, మైదానంలో మాత్రం జట్టులో ఆత్మస్థైర్యాన్ని నింపుతున్నాడు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు 250 పరుగులకి మొదటి ఇన్నింగ్స్‌లో ఆలౌటైంది. అనంతరం తొలి ఇన్నింగ్స్‌లో ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టు 235 పరుగులకే ఆలౌటైంది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 15 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. 191/7 ఓవర్‌నైట్ స్కోర్‌తో 88.1 ఓవర్ల వద్ద మూడో రోజు ఆట ప్రారంభించిన ఆస్ట్రేలియా కేవలం 44 పరుగులు మాత్రమే జోడించి మిగతా వికెట్లను కోల్పోయింది.
భారత బౌలర్లు రాణించడంతో
భారత బౌలర్లు రాణించడంతో ఆసీస్ బ్యాట్స్‌మెన్ పెవిలియన్‌కు క్యూ కట్టారు. మూడో రోజు ఆటలో భాగంగా శనివారం తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన ఆస్ట్రేలియా జట్టు 204 పరుగుల వద్దే మిచెల్ స్టార్క్ (15: 34 బంతుల్లో 1x4) రూపంలో 8వ వికెట్ కోల్పోయింది. దీంతో.. కాసేపు మైదానంలో విరాట్ కోహ్లీ తెగ ఉత్సాహంగా కనిపించాడు.

పాటలు పాడుతూ.. స్టెప్‌లు వేసిన కోహ్లీ
పాటలు పాడుతూ.. స్టెప్‌లు వేసి మరీ అభిమానుల్ని అలరించాడు. మ బ్యాట్స్‌మెన్‌ను అతిగా కవ్వించిన మిచెల్ స్టార్క్ ఔట్ కావడంతో పాటు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియాకు ఆధిక్యం లభించడంతో కోహ్లీ అలా సరదాగా చేసినట్లు తెలుస్తోంది. 91.4 ఓవర్లో బుమ్రా వేసిన బంతిని మిచెల్ స్టార్క్(15; 34బంతుల్లో) పంత్‌కి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.

మళ్లీ ఆట మొదలు కాగానే, షమీకి మిగతా రెండు వికెట్లు
అప్పటికే వర్షం ప్రారంభం కావడంతో మ్యాచ్‌ను నిలిపివేశారు. దీంతో కొంత సమయం ఆట నిలిచిపోయింది. మళ్లీ ఆట మొదలు కాగానే, షమీ మిగతా రెండు వికెట్లు పడగొట్టాడు. ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ ట్రావిస్ హెడ్ అత్యధికంగా 72 పరుగులు చేశాడు. ఆ తర్వాత హ్యాండ్స్ కాంబ్ (34), కవాజా (28) పరుగులతో ఫరవాలేదనిపించారు.

తొలి ఇన్నింగ్స్ భారత్ 250 పరుగులు చేసి ఆలౌట్
భారత బౌలర్లలో బుమ్రా, ఆశ్విన్‌లు మూడేసి వికెట్లు తీసుకోగా, ఇశాంత్ శర్మ, షమీలు రెండేసి వికెట్లు తీసుకున్నారు. అంతకుముందు తొలి ఇన్నింగ్స్ భారత్ 250 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. భారత బ్యాట్స్ మెన్లలో పుజారా సెంచరీ నమోదు చేసిన సంగతి తెలిసిందే. టెస్టుల్లో పుజారాకు ఇది 16వ సెంచరీ.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications