న్యూఢిల్లీ: దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ భారతీయ త్రివిధ దళాలను ఉద్దేశించి మనసుకు హత్తుకునే సందేశాన్ని పోస్టు చేశాడు. భారత ప్రధాని నరేంద్రమోడీ #Sandesh2Soldiers అంటూ ఇచ్చిన పిలుపు మేరకు తాజాగా కోహ్లీ భారత జవాన్లకు దీపావళి గ్రీటింగ్స్ తెలిపాడు.

కోహ్లీ తన ట్విట్టర్‌లో పోస్టు చేసిన ఈ వీడియో సందేశం ప్రతి ఒక్కరి మనసుని హత్తు కుంటుంది. సోషల్ మీడియాలో ఈ వీడియో ప్రస్తుతం ఓ వైరల్‌లా మారింది. ఇంతకీ కోహ్లీ ఏం చెప్పాడో తన మాటలను ఈ వీడియోలో చూడండి.
'నేను, విరాట్ కోహ్లీని, దీపావళి సందర్భంగా భారత జవాన్లకు శుభాకాంక్షలు'
'కుటుంబానికి దూరంగా ఉండటం ఏంటో నాకు తెలుసు. మీరు మన దేశాన్ని రక్షించే తీరు కొనియాడలేనిది'
'నా సోదరులారా, నమ్మకం ఉంచండి.. యావత్ దేశం మొత్తం మీ వెంటే ఉంది' అంటూ కోహ్లీ వీడియో సందేశాన్ని ట్విట్టర్‌లో పోస్టు చేశాడు. అంతేకా కాదు 'మీరు జవాన్‌ని చూసినప్పుడు, వారికి సెల్యూట్ చేయండి. వారి వల్లే మనం పండుగలను ప్రశాంతంగా జరుపుకుంటున్నాం. జైహింద్. #Sandesh2Soldiers' అంటూ మేసేజ్‌ని కూడా పోస్ట్ చేశాడు.
ఇక టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తన ట్విట్టర్‌లో దీపావళి సందర్భంగా భారత త్రివిధ దళాలను ఉద్దేశించి ఓ వీడియో సందేశాన్ని పోస్టు చేశాడు.