ఆఖరి బంతికి సిక్స్ బాదిన బుమ్రా: మురిసిపోయిన కోహ్లీ (వీడియో)


హైదరాబాద్: మొహాలీ వేదికగా ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో వన్డేలో భారత ఇన్నింగ్స్ చివరి బంతికి పేసర్ జస్ప్రీత్ బుమ్రా కొట్టిన సిక్స్‌కు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫిదా అయ్యాడు. బుమ్రా సిక్స్ కొట్టిన ఆనందరంలో విరాట్ కోహ్లీ ఎగిరి గంతేస్తూ చప్పట్లు చరిచాడు. కోహ్లీతో పాటు మిగతా ఆటగాళ్లు కూడా సంబరాలు చేసుకున్నారు.
ఆఖరి ఓవర్ వేసిన పాట్ కమిన్స్
ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్ వేసిన పాట్ కమిన్స్ బౌలింగ్‌లో తొలి బంతిని సిక్స్‌గా మలిచిన విజయ్ శంకర్ మూడో బంతికి ఔటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన చాహల్ ఐదో బంతికి ఔటవ్వగా చివరి వికెట్‌గా బుమ్రా క్రీజులోకి వచ్చాడు. అప్పటికే ఐదు వికెట్లు పడగొట్టిన కమిన్స్.. బుమ్రాని ఔట్ చేస్తాడు లేదా కనీసం బంతిని డాట్ చేస్తాడని అంతా భావించారు.
లాంగాన్ దిశగా సిక్స్
అయితే, ఆఖరి బంతిని కళ్లుచెదిరే రీతిలో లాంగాన్ దిశగా సిక్స్‌గా మలిచాడు. తన క్రికెట్ కెరీర్‌లో బుమ్రాకి ఇది ఏడో సిక్స్. లిస్ట్-ఏ గేమ్‌లో నాలుగు... టీ20ల్లో మూడు సిక్సులను బాదాడు. అయితే, అంతర్జాతీయ మ్యాచ్‌లో మొదటిసారి సిక్స్ బాదడంతో ఒక్కసారిగా టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లో సంబరాలు మొదలయ్యాయి.
ఆనందంతో తెగ మురిసిపోయిన కోహ్లీ
బుమ్రా సిక్స్‌కి కెప్టెన్ విరాట్ కోహ్లి మాత్రం ఆనందంతో తెగ మురిసిపోయాడు. చప్పట్లు కొడుతూ బుమ్రాను మెచ్చుకున్నాడు. మరోవైపు నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న కుల్దీప్ యాదవ్ బుమ్రాను అభినందించాడు. తన కెరీర్‌లో ఇప్పటి వరకూ 48 వన్డేలాడిన బుమ్రాకి ఇదే తొలి సిక్స్ కావడం విశేషం. ఇందుకు సంబంధించిన వీడియోని బీసీసీఐ తన ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకుంది.

4 వికెట్ల తేడాతో భారత్ ఓటమి
ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో వన్డేలో భారత్ ఓటమి పాలైంది. మొహాలి వేదికగా ఆదివారం జరిగిన నాలుగో వన్డేలో 358 పరుగుల భారీ స్కోరు చేసినప్పటికీ.. పేలవ బౌలింగ్, ఫీల్డింగ్ కారణంగా టీమిండియా 4 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. 359 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ ఇంకా 13 బంతులు ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. ఐదు వన్డేల సిరీస్ 2-2తో సమం అయింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications