సిరాజ్ చేతికి ట్రోఫీ: అభిమానుల మనసు గెలిచిన కోహ్లీ (వీడియో)
హైదరాబాద్: విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా జట్టుని ముందుండి నడిపిస్తున్న నాయకుడు మాత్రమే కాదు... యువ ఆటగాళ్లను ఎంతగానో ప్రోత్సహిస్తాడనే ఎటువంటి సందేహాం లేదు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య టీ20 సిరీస్ ముగిసిన సంగతి తెలిసిందే.
తిరువనంతపురం వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20ని వర్షం కారణంగా ఈ మ్యాచ్‌ని 8 ఓవర్లకు కుదించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో 67 పరుగులు చేసింది. అనంతరం 68 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ 61 పరుగులు చేసింది.

కివీస్‌పై 6 పరుగుల తేడాతో విజయం
దీంతో కివీస్‌పై 6 పరుగుల తేడాతో విజయం సాధించిన కోహ్లీసేన తొలిసారి కివీస్‌పై టీ20 సిరిస్‌ను కైవసం చేసుకుని ట్రోఫీని గెలుచుకుంది. న్యూజిలాండ్‌తో జరిగిన మూడు టీ20ల సిరిస్‌లో హైదరాబాద్ యువ బౌలర్ మహమ్మద్ సిరాజ్ రాజ్‌కోట్‌లో జరిగిన రెండో టీ20లో సిరాజ్ అరంగేట్రం చేశాడు.

సిరాజ్‌కు షాకిచ్చిన కోహ్లీ
ఈ నేఫథ్యంలో తిరువనంతపురం వేదికగా జరిగిన మూడో టీ20 అనంతరం పేసర్ సిరాజ్‌కు కెప్టెన్ విరాట్ కోహ్లీ షాకిచ్చాడు. మ్యాచ్ అనంతరం నిర్వాహకుల వద్ద నుంచి ట్రోఫీని అందుకున్న కోహ్లీ నేరుగా సిరాజ్ చేతికి అందించి తన హుందాతనాన్ని చాటుకున్నాడు. దీంతో సిరాజ్ ఒకింత ఆశ్చర్యానికి గురయ్యాడు.
చివరి టీ20లో సిరాజ్‌కు దక్కని చోటు
ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. యువ ఆటగాళ్లను ఎప్పుడూ ప్రోత్సహించే కోహ్లీ ఆ క్రమంలోనే సిరాజ్‌కు ట్రోఫీని అందజేశాడని పలువురు నెటిజన్లు కోహ్లీపై ప్రశంసల వర్షం కురిపించాడు. కాగా, చివరి టీ20లో సిరాజ్‌కు చోటు దక్కలేదు.

ధోని సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్న కోహ్లీ
రాజ్‌కోట్ వేదికగా జరిగిన రెండో టీ20లో 4 ఓవర్లు వేసిన సిరాజ్ ఒక వికెట్ తీసి ధారాళంగా పరుగులివ్వడంతో మూడో టీ20కి విశ్రాంతినిచ్చారు. అయితే మ్యాచ్ తర్వాత కొత్త కుర్రాడు సిరాజ్‌కు ఊహించని షాకిచ్చి సంభ్రమాశ్చర్యానికి గురిచేశాడు. భారత జట్టులోకొచ్చిన యువ క్రికెటర్లను ఇలా గౌరవించడం అనవాయితీగా మారింది. గతంలో ధోని కెప్టెన్‌గా చేసిన సమయంలో కూడా ఇలానే యువ క్రికెటర్లను ప్రోత్సహించాడు. ఇప్పుడు దానిని కోహ్లీ కొనసాగిస్తున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications