For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఖేల్‌రత్న అవార్డు అందుకున్న కోహ్లీ: అనుష్క పెదవిపై చిరునవ్వు

Virat Kohli Receives Rajiv Gandhi Khel Ratna Award
WATCH: Virat Kohli Receives the Prestigious Khel Ratna Award

హైదరాబాద్: రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రతిష్టాత్మక రాజీవ్‌ గాంధీ ఖేల్‌రత్న అవార్డు అందుకున్నాడు. రాష్ట్రపతి భవన్‌లో మంగళవారం జరిగిన జాతీయ స్పోర్ట్స్ అవార్డుల కార్యక్రమంలో విరాట్ కోహ్లీ ఈ అవార్డుని అందుకున్నాడు. ఈ కార్యక్రమానికి కోహ్లీ తల్లితో పాటు భార్య అనుష్క శర్మ కలిసి హాజరయ్యాడు.

virat

వివిధ క్రీడల్లో అద్భుత ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లకు అవార్డులు వరించాయి. టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీతో పాటు మహిళా వెయిట్‌ లిఫ్టర్‌ మీరాబాయి చాను రాజీవ్‌ గాంధీ ఖేల్‌రత్న అవార్డు స్వీకరించిన వారిలో ఉన్నారు. ఇక, జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రాతో పాటు మరో 20 మంది క్రీడాకారులు అర్జున అవార్డును అందుకున్నారు. అండర్-20 అథ్లెటిక్స్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో గోల్డ్ మెడల్ గెలిచి చరిత్ర సృష్టించిన హిమదాస్ అర్జున అవార్డు అందుకుంది.

ఖేల్‌ రత్న పురస్కారం పొందిన వారికి పతకం, ప్రశంసా పత్రంతోపాటు రూ. 7 లక్షల 50 వేలు... అర్జున అవార్డు గ్రహీతలకు అర్జునుడి ప్రతిమతోపాటు రూ. 5 లక్షల నగదు పురస్కారాన్ని రాష్ట్రపతి అందజేశారు. నిజానికి ఈ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం జాతీయ క్రీడల దినోత్సవం (ఆగస్టు 29)న జరగాలి.

అయితే, ఈ ఏడాది ఆసియా గేమ్స్‌ను ఉన్న నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని సెప్టెంబర్‌ 25కు వాయిదా వేశారు. న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో అట్టహాసంగా జరిగిన ఈ అవార్డుల కార్కక్రమంలో ద్రోణాచార్య, ధ్యాన్‌చంద్‌ అవార్డులను కూడా గ్రహీతలకు అందజేశారు.

రాజీవ్‌ గాంధీ ఖేల్‌రత్న అవార్డు గ్రహీతలు:
మీరాబాయి ఛాను - వెయిట్‌లిఫ్టింగ్‌
విరాట్‌ కోహ్లీ - క్రికెట్‌

ద్రోణాచార్య అవార్డు గ్రహీతలు:
సుబేదార్‌ చెనంద అచ్చయ్య కట్టప్ప - బాక్సింగ్‌
విజయ్‌ శర్మ - వెయిట్‌లిఫ్టింగ్‌
ఎ. శ్రీనివాసరావు - టేబుల్‌ టెన్నిస్‌
సుఖ్‌దేవ్‌ సింగ్‌ పన్ను - అథ్లెటిక్స్‌
క్లారెన్స్‌ లోబో - హాకీ(లైఫ్‌టైమ్‌)
తారక్‌ సిన్హా - క్రికెట్‌(లైఫ్‌టైమ్‌)
జీవన్‌ కుమార్‌ శర్మ - జూడో(లైఫ్‌టైమ్‌)
వీఆర్‌ బీడు - అథ్లెటిక్స్‌(లైఫ్‌టైమ్‌)

అర్జున అవార్డు అందుకున్నవారు:
నీరజ్‌ చోప్రా - అథ్లెటిక్స్‌
సుబేదార్‌ జిన్సన్‌ జాన్సన్‌ - అథ్లెటిక్స్‌
హిమా దాస్‌ - అథ్లెటిక్స్‌
ఎన్‌. సిక్కీరెడ్డి - బ్యాడ్మింటన్‌
సుబేదార్‌ సతీశ్‌ కుమార్‌ - బాక్సింగ్‌
స్మృతి మంధాన - క్రికెట్‌
శుభాంకర్‌ శర్మ - గోల్ఫ్
మన్‌ప్రీత్‌ సింగ్‌ - హాకీ
సవిత - హాకీ ‌
కల్నల్ రవి రాథోడ్‌ - పోలో
రహీ సర్నోబత్‌ - షూటింగ్‌
శ్రేయాసి సింగ్‌ - షూటింగ్‌
మనికా బత్రా - టేబుల్‌ టెన్నిస్‌
సతియాన్‌ - టేబుల్‌ టెన్నిస్‌
రోహన్‌ బోపన్న - టెన్నిస్‌
సుమిత్‌ - రెజ్లింగ్
పూజా కడియన్‌ - వుషు
అంకుర్‌ ధమా - పారా అథ్లెటిక్స్‌
మనోజ్‌ సర్కార్‌ - పారా బ్యాడ్మింటన్‌
అంకుర్‌ మిట్టల్‌ - షూటింగ్‌

ధ్యాన్‌చంద్‌ అవార్డు అందుకున్నవారు:
సత్యదేవ్‌ ప్రసాద్‌ - ఆర్చరీ
భరత్‌ కుమార్‌ ఛెత్రీ - హాకీ
బాబీ అలోయ్‌సియస్‌ - అథ్లెటిక్స్‌
చౌగలే దాదు దత్తాత్రేయ - రెజ్లింగ్‌

మౌలానా అబుల్‌ కలామ్‌ ఆజాద్‌ (MAKA) ట్రోఫీ 2017-18:
గురునానక్‌ దేవ్‌ యూనివర్శిటీ - అమృత్‌సర్‌

Story first published: Tuesday, September 25, 2018, 18:23 [IST]
Other articles published on Sep 25, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+