న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

భజ్జీ తోడుగా.. బ్రావోతో కలిసి చిందేసిన కోహ్లీ (వీడియో)

 Watch: Virat Kohli, KL Rahul join Dwayne Bravo on the dance floor

హైదరాబాద్: పార్టీలంటే కోహ్లీ జోరు మనకు తెలిసిందే. దాంతో పాటు కరేబియన్ ఆటగాళ్లు తోడైతే ఆ జోష్ చెప్పక్కర్లేదు. ఈ క్రమంలోనే ఇటీవల జరిగిన వేడుకలో బ్రావో, కోహ్లీ కలిసి స్టెప్పులేశారు. ప్రస్తుతం వైరల్‌గా మారిన వీడియోలు నెట్టింట్లో హల్‌చల్ చేస్తున్నాయి. తాజాగా ఐపీఎల్‌లో ఆడుతున్న కొంతమంది క్రికెటర్లు ఓ ప్రమోషనల్ ఈవెంట్‌లో పాల్గొని సందడి చేశారు.

ఈ కార్యక్రమంలో ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడుతున్న ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో పాటలు పాడుతూ స్టేజ్‌పై డ్యాన్స్ చేశాడు. అతనితో పాటు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఓపెనర్ కేఎల్ రాహుల్, చెన్నై సీనియర్ స్పిన్నర్ హర్భజన్‌సింగ్ కలిసి గ్రూప్ డ్యాన్స్ చేశారు. ఈ ఈవెంట్‌లో విరాట్ కోహ్లీనే ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు.

గతంలో బాలీవుడ్ పాటలకు చాలాసార్లు అతడు స్టెప్పులేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. పెళ్లయిన తరువాత తన భార్య అనుష్కశర్మతోనూ కాలు కదిపిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 25న ఈ బెంగుళూరు, చెన్నై జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. మళ్లీ మే 5న కూడా ఈ ఇరు జట్లు తలపడనున్నాయి. ఇప్పటి వరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు ఆడిన 3 మ్యాచ్‌లలో కేవలం ఒక మ్యాచ్ లోనే గెలిచి రెండింటిలోనూ పరాజయం పాలైంది. వరుసగా రెండు మ్యాచ్‌లలోనూ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ తొలిసారి పరాజయాన్ని అందుకుంది.

ఆదివారం రోజు జరిగిన మ్యాచ్‌లో సొంతగడ్డ చిన్నస్వామి స్టేడియం వేదికగా బెంగళూరుకు రాజస్థాన్ షాకిచ్చింది. 218 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 6 వికెట్లకు 198 పరుగులు చేసింది. దీంతో బెంగళూరుపై రాజస్థాన్ 19 పరుగుల తేడాతో విజయం సాధించింది. అంతకుముందు సంజు శాంసన్(92 నాటౌట్) అద్భుత ఇన్నింగ్స్‌తో రాణించడంతో నిర్ణీత ఓవర్లలో రాజస్థాన్ 4 వికెట్లకు 217 పరుగులు చేసింది. చేధనలో విఫలమైన కోహ్లీసేన 17 పరుగలు తేడాతో విఫలమైంది.

Story first published: Tuesday, April 17, 2018, 17:29 [IST]
Other articles published on Apr 17, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X