వద్దని వారించిన అంఫైర్: టీ బ్రేక్‌లో బంతితో కోహ్లీ ఆట (వీడియో)


హైదరాబాద్: సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో గురువారం ప్రారంభమైన చివరి టెస్టులో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బాల్ టాంపరింగ్‌కు పాల్పడ్డాడని అతడిపై నిషేధం విధించాలని ఆసీస్ అభిమానులు సోషల్ మీడియాలో మండిపడుతున్నారు. సిడ్నీ టెస్టులో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బంతితో ఆడుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
సాధారణంగా అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఓవర్ ముగిసిన వెంటనే బంతిని అంఫైర్‌కు ఇవ్వజం జరుగుతుంది. ఆటలో ఎలాంటి విరామం వచ్చినా బంతిని తమ ఆధీనంలోనే పెట్టుకుంటారు ఫీల్డ్ అంపైర్లు. ఇలా చేయడం వల్ల బాల్ ట్యాంపరింగ్‌ను సాధ్యమైనంత వరకూ అరికట్టవచ్చనేది ఐసీసీ భావన.

బంతి ఆకారంలో తేడా
ఒకవేళ బంతి ఆకారంలో ఏమైనా తేడా కనిపిస్తే దానిని అంపైర్ దృష్టికి తీసుకెళ్లడం వరకూ మాత్రమే ఆటగాళ్లు చేసే పని. అప్పుడు ఆ బంతిని చెక్ చేసి ఏం చేయాలనేది ఫీల్డ్ అంపైర్ నిర్ణయం తీసుకుంటాడు. తాజాగా సిడ్నీ టెస్టులో టీ విరామ సమయంలో అంపైర్ వద్ద నుంచి బంతిని తీసుకున్న కోహ్లీ దానిని బ్యాట్‌తో కొట్టాడు.
బంతితో బ్యాట్‌ను పరీక్షించిన కోహ్లీ
ఆటను తిరిగి ఆరంభించే క్రమంలో ఆసీస్ ఆటగాళ్ల కోసం నిరీక్షించే సమయంలో బంతిని అంపైర్ నుంచి తీసుకున్న కోహ్లీ బంతిని పైకి ఎగరవేసి బ్యాట్ మిడిల్‌లో తాకేలా పరీక్షించాడు. బంతిని చూస్తానని చెప్పి కోహ్లీ ఇలా చేయడంతో అంపైర్ రిచర్డ్ కెటెల్‌బోరో ఆశ‍్చర్యానికి గురయ్యాడు. ఆ తర్వాత కోహ్లీ నుంచి ఆ బంతిని బలవంతంగా తీసుకున్నాడు.
బంతి ఆకారం, మెరుపు దెబ్బతినే అవకాశం
ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే, కోహ్లీ ఇక్కడ చేసింది బ‍్యాట్ స్ట్రోక్‌ను చెక్ చేయడానికే. కోహ్లీ అలా చేయడం ద్వారా బంతి ఆకారం, మెరుపు దెబ్బతినే అవకాశం ఉందని దీంతో కోహ్లీ బాల్ టాంపరింగ్‌కు పాల్పడ్డాంటూ ఆసీస్ అభిమానులు కోహ్లీపై నిషేధం విధించాలని డిమాండ్ చేస్తున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications