For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కోహ్లీని కవ్వించి సిక్సు బాదించుకున్న రబాడ (వీడియో)

By Nageshwara Rao
 Virat Kohli, Hit On The Ribs, Clobbers Next Ball For 6

హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని కవ్వించి దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ కగిసో రబాడ సిక్సర్ బాదించుకున్న సంఘటన సెంచూరియన్ వేదికగా ఆదివారం జరిగిన రెండో వన్డేలో చోటు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన సఫారీ జట్టు భారత బౌలర్ల దెబ్బకు 118 పరుగులకే ఆలౌటైంది.

అనంతరం 119 పరుగుల విజయ లక్ష్యంతో టీమిండియా బరిలోకి దిగింది. ఈ క్రమంలో ఇన్నింగ్స్ 8వ ఓవర్ వేసేందుకు రబాడ బంతిని అందుకున్నాడు. రబాడ వరుస షార్ట్ పిచ్‌ బంతులతో విరాట్ కోహ్లిని పరీక్షించాడు. తొలి నాలుగు బంతులను షార్ట్ పిచ్ బంతులుగా వేయడంతో కోహ్లీ ఒక పరుగు కూడా చేయలేకపోయాడు.

అదే ఓవర్‌లోని ఐదో బంతి‌ని హిట్ చేసేందుకు విరాట్ కోహ్లి ప్రయత్నించగా.. అది బ్యాట్‌కి అందకుండా నేరుగా వెళ్లి కోహ్లి శరీరానికి బలంగా తాకింది. దీంతో కాసేపు నొప్పితో కోహ్లి క్రీజులో విలవిలలాడిపోయాడు. ఈ సమయంలో బంతి అందుకునేందుకు కోహ్లీ సమీపంలోకి వచ్చిన రబాడ కవ్వించాడు.

దీంతోఆ ఓవర్‌లోని చివరి బంతిని ఎదుర్కొన్న కోహ్లీ ఫైన్‌ లెగ్‌ దిశగా సిక్స్ రూపంలో స్టాండ్స్‌లోకి తరలించి రబాడకు దీటైన సమాధానం ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, ఇలాంటి బంతినే రోహిత్ శర్మ హిట్ చేయబోయి అంతకముందే ఔటవడం విశేషం.

ఈ మ్యాచ్‌లో భారత్ 20.3 ఓవర్లలోనే ఒక వికెట్ కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో కోహ్లీ సేన 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆరు వన్డేల సిరిస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య మూడో వన్డే కేప్‌టౌన్ వేదికగా బుధవారం జరగనుంది.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Monday, February 5, 2018, 21:46 [IST]
Other articles published on Feb 5, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+