పాండ్యా ఓ సూపర్ స్టార్: డ్రెస్సింగ్ రూమ్‌లో కోహ్లీసేన సంబరాలు
హైదరాబాద్: ఇండోర్ వేదికగా ఆదివారం జరిగిన మూడో వన్డేలో భారత్ 5 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై ఘనవిజయం సాధించింది. దీంతో ఐదు వన్డేల సిరీస్‌ను మరో రెండు మ్యాచ్‌లు మిగిలుండగానే 3-0తో కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియాపై ఐదు వన్డేల సిరీస్‌ను రెండు మ్యాచ్‌లుండగానే భారత్ గెలవడం ఇదే తొలిసారి కావడంతో కోహ్లీ సేన సంబరాల్లో మునిగిపోయింది.
మ్యాచ్ అనంతరం అవార్డుల ప్రధానోత్సవం ముగిసిన తర్వాత కోహ్లీ సేన డ్రస్సింగ్ రూమ్‌లో సంబరాలు చేసుకుంది. మూడో వన్డేలో 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు అందుకున్న హార్దిక్ పాండ్యా కేక్ కట్ చేసి సహచర ఆటగాళ్లకు తినిపించాడు. ఈ సందర్భంగా ఆటగాళ్లు పలువురు బాలీవుడ్ పాటలకు డ్యాన్స్ చేశారు.
ఈ సందర్భంగా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్న పాండ్యాపై కోహ్లీ ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ మ్యాచ్‌లో పాండ్యాను ఎందుకు నాలుగో స్థానంలో పంపాల్సి వచ్చిందో కూడా చెప్పాడు. తనకు వచ్చిన ప్రమోషన్‌ను పాండ్యా సద్వినియోగం చేసుకున్నాడు. మూడో వన్డేలో 72 బంతుల్లో 78 పరుగులు చేసిన జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.
అంతేకాదు మనీష్ పాండేతో కలిసి ఐదో వికెట్‌కు 78 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఈ భాగస్వామ్యమే మ్యాచ్‌ను మలుపు తిప్పింది. సాధారణంగా ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చే హార్దిక్ పాండ్యాను మూడో వన్డేలో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు పంపారు. అంతకుముందు జరిగిన మ్యాచ్‌ల్లో ఆ స్థానంలో మనీష్ పాండే, కేదర్ జాదవ్‌లు విఫలం కావడంతో పాండ్యాను ప్రమోట్ చేశారు.

ఆ ఆలోచన కోచ్ రవిశాస్త్రిదే
అయితే పాండ్యాను నాలుగో స్థానంలో పంపాలన్న ఆలోచన కోచ్ రవిశాస్త్రిదేనని కోహ్లి చెప్పాడు. ఆసీస్ స్పిన్నర్‌ను అటాక్ చేయడానికి పాండ్యాను పంపిస్తే మంచిదని కోచ్ రవిశాస్త్రి భావించినట్లు కోహ్లీ తెలిపాడు. 'పాండ్యాకు మా పూర్తి మద్దతు ఉంది. అతను బాగా కష్టపడే వ్యక్తి' అని అన్నాడు.

హార్ధిక్ పాండ్యాపై విరాట్ కోహ్లీ ప్రశంసలు
స్పిన్నర్లను బాగా ఎటాక్ చేసే పాండ్యాను బ్యాటింగ్ ఆర్డర్‌లో మరింతపైకి తీసుకొద్దామని రవిశాస్త్రి చెప్పడంతో అతని ఆలోచనకు ఎటువంటి అభ్యంతరం చెప్పలేదని కోహ్లీ చెప్పాడు. అలా పాండ్యా బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందుకొచ్చి కోచ్ పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేశాడని, మా జట్టులో పాండ్యా సూపర్ స్టార్ అని కోహ్లీ కొనియాడాడు.
వీడియోని షేర్ చేసిన కోహ్లీ
ఇక పాండ్యాతో కలిసి మాట్లాడుతున్న వీడియో తీసిన సమయంలో వెనుక ఉన్న కేఎల్ రాహుల్‌ను విరాట్ కోహ్లీ టీజ్ చేశాడు. నిజానికి వన్డేల్లో కేఎల్ రాహుల్ నాలుగో స్థానంలో వస్తున్నాడు. ఇప్పుడు పాండ్యా నాలుగోస్థానంలో బాగా రాణించాడంటూ వెనుక ఉన్న రాహుల్‌ను చూసి కోహ్లీ నవ్వాడు.
డ్రెస్సింగ్ రూమ్‌లో టీమిండియా సంబరాలు
ఇదిలా ఉంటే మూడో వన్డేలో టీమిండియా విజయం సాధించడంతో వన్డేల్లో కోహ్లీసేన నెంబర్ వన్ స్ధానాన్ని సొంతం చేసుకుంది. ‘భారత క్రికెట్ జట్టుకు ఈ రోజు ఎంతో ప్రత్యేకమైనది. కంగారూలపై సిరీస్‌ను కైవసం చేసుకోవడంతో పాటు వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరుకుంది.' అని బీసీసీఐ పేర్కొంది. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విటర్ ద్వారా అభిమానులతో పంచుకుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications