
మ్యాచ్‌కి వర్షం అడ్డంకిగా
ఐసీసీ నిబంధనల ప్రకారం మ్యాచ్‌కి వర్షం అడ్డంకిగా మారినప్పుడు ఏ దశలోనైనా మ్యాచ్‌ని నిలిపివేసే అధికారం అంపైర్లకి ఉంటుంది. గత బుధవారం బ్రిస్బేన్ వేదికగా జరిగిన తొలి టీ20లోనూ వర్షం రావడంతో 16.1 ఓవర్లలో ఆటని అంపైర్లు నిలిపివేసిన సంగతి తెలిసిందే. వర్షం తర్వాత మ్యాచ్‌ని 17 ఓవర్లకి కుదించడంతో మళ్లీ 17 ఓవర్‌లో మిగిలిన ఐదు బంతులను ఆడించారు.

వర్షపు చినుకులు బంతిపై పడటంతో
వాస్తవానికి వర్షపు చినుకులు బంతిపై పడటంతో అటు బౌలర్లతో పాటు ఫీల్డర్లకు సైతం పట్టు చిక్కదు. ఈ కారణంతో కోహ్లీ మ్యాచ్ నిలిపివేయాల్సిందిగా కోరాడు. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌ను తొలుత 19 ఓవర్లకు కుదించిన అంపైర్లు వర్షం తెరిపినివ్వకపోవడంతో మరోమారు ఓవర్లు కుదించారు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 19 ఓవర్లు ముగిసే సరికి ఏడు వికెట్లు కోల్పోయి 132 పరుగులు చేసింది.

వర్షం ఎంతకీ తగ్గక పోవడంతో
వర్షం ఎంతకీ తగ్గక పోవడంతో ఆసీస్ ఇన్నింగ్స్ ముగిసినట్లుగా అంఫైర్లు ప్రకటించారు. అనంతరం డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం టీమిండియా విజయ లక్ష్యాన్ని 137 పరుగులుగా నిర్ధారించారు. టీమిండియా ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ మైదానంలోకి అడుగుపెట్టారు.
తొలుత భారత్ లక్ష్యాన్ని 11 ఓవర్లలో 90 పరుగులకు కుదించిన అంఫైర్లు
ఈ క్రమంలో మరోమారు వర్షం కురిసింది. దీంతో మైదానం సిబ్బంది పిచ్‌పై కవర్లను అలాగే ఉంచారు. ఆ తర్వాత వర్షం కాసేపు తగ్గుముఖం పట్టడం, ఆటగాళ్లు మైదానంలోకి రావడం, మళ్లీ వర్షం రావడం జరిగింది. దీంతో భారత లక్ష్యాన్ని 11 ఓవర్లలో 90 పరుగులకు కుదించారు. వర్షం ఆగితే స్థానిక కాలమానం ప్రకారం 22:02 గంటలకు మ్యాచ్ ప్రారంభమైతే కోహ్లీసేన 5 ఓవర్లకు 46 పరుగుల లక్ష్యాన్ని ఛేదించాల్సి వచ్చేది.

వర్షం ఎంతకీ తగ్గుముఖం పట్టకపోతే
ఆ తర్వాత వర్షం ఎంతకీ తగ్గుముఖం పట్టకపోతే అంఫైర్లు మ్యాచ్‌ను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ టోర్నీలో వర్షం కారణంగా మ్యాచ్ నిలవడం ఇది రెండోసారి కావడం విశేషం. బ్రిస్బేన్ వేదికగా జరిగిన తొలి టీ20లోనూ వర్షం కారణంగా మ్యాచ్ నిలిచింది. దీంతో దీంతో డక్ వర్త్ లూయీస్ పద్ధతిలో భారత్‌కు 17 ఓవర్లలో 174 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. ఈ మ్యాచ్‌లో టీమిండియా 4 పరుగుల తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications













