కోహ్లీ సాధించేనా: లార్డ్స్‌లో టీమిండియా నెట్ ప్రాక్టీస్ (వీడియో)

హైదరాబాద్: ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ గురువారం ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌కి ప్రఖ్యాత లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ ఆతిథ్యమిస్తోంది. ఈ నేపథ్యంలో రెండో టెస్టు కోసం టీమిండియా లార్డ్స్‌కు చేరుకుంది. ఇందులో భాగంగా మంగళవారం భారత ఆటగాళ్లు లార్డ్స్ మైదానంలో సాధన చేశారు.
ఇందుకు సంబంధించిన ఫొటోలను బీసీసీఐ ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకుంది. ఆటగాళ్లందరూ బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ప్రాక్టీస్ చేశారు. టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి లార్డ్స్ పిచ్‌ను పరిశీలించాడు. పిచ్ గురించి క్యూరేటర్‌ను అడిగి పూర్తి సమాచారం తెలుసుకున్నాడు.
రెండో టెస్టులో టీమిండియా బ్యాటింగ్‌తో పాటు ఫీల్డింగ్‌పై జట్టు ప్రత్యేక దృష్టి సారించింది. చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ టీమిండియా ప్రాక్టీస్ సెషన్లో కనిపించడంతో రెండో టెస్టులో అతడికి చోటు దక్కుతుందేమోనని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటి వరకు 17 టెస్టులాడిన టీమిండియా
ఈ మైదానంలో ఇప్పటి వరకు 17 టెస్టులాడిన టీమిండియా కేవలం రెండింట్లో మాత్రమే విజయాలను నమోదు చేసింది. మరోవైపు 11 టెస్టుల్లో ఓటమి పాలుకాగా, నాలుగు టెస్టులను డ్రాగా ముగించింది. లార్డ్స్‌లో టెస్టు మ్యాచ్ అంటే ప్రతి జట్టుకు ఎంతో ప్రత్యేకం. టీమిండియా సారథ్య బాధ్యతలు వహించిన ఇద్దరు ఆటగాళ్లు మాత్రమే లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో విజయాలను సాధించారు.

ఇప్పుడు కోహ్లీ వంతు
భారత మాజీ కెప్టెన్లు కపిల్ దేవ్, మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలో మాత్రమే భారత్ ఇప్పటి వరకు లార్డ్స్‌లో విజయాలు నమోదు చేసుకుంది. ఇప్పుడు కోహ్లీ వంతు వచ్చింది. దీంతో లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో విరాట్ కోహ్లీ విజయాన్ని అందుకుంటాడా? లేదా? అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
1932లో లార్డ్స్‌లో తొలి టెస్టు ఆడిన టీమిండియా
1932లో తొలిసారి సీకే నాయుడు కెప్టెన్సీలో భారత్ లార్డ్స్‌లో తొలి టెస్టు ఆడింది. ఈ టెస్టులో భారత్ 158 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఆ తర్వాత జరిగిన ఏడు టెస్టుల్లో భారత జట్టు పరాజయం పాలుకాగా, రెండింటిని డ్రాగా ముగించింది. మళ్లీ 1986లో కపిల్ దేవ్ కెప్టెన్సీలో భారత్ లార్డ్స్‌లో తొలి విజయాన్ని నమోదు చేసుకుంది.

కోహ్లీ సేన విజయం సాధిస్తుందో లేదో
ఈ మ్యాచ్‌లో కపిల్ నాయకత్వంలోని టీమిండియా ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆ తర్వాత 2014లో మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలో భారత్ రెండో సారి లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో విజయం సాధించింది. మళ్లీ చాన్నాళ్లకు కోహ్లీ నాయకత్వంలో భారత్ లార్డ్స్ మైదానంలో టెస్టు ఆడబోతోంది. గురువారం నుంచి ప్రారంభంకానున్న ఈ టెస్టులో కోహ్లీ సేన విజయం సాధిస్తుందో లేదో చూడాలి.
తొలి టెస్టులో భారత్ 31 పరుగుల తేడాతో ఓటమి
కెప్టెన్‌గా కోహ్లీ ఈ మైదానంలో విజయం సాధించి కపిల్‌దేవ్, ధోనీ సరసన నిలుస్తాడో లేదో చూడాలి. కాగా, ఈ సిరిస్‌లో భాగంగా ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో భారత్ 31 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. దీంతో రెండో టెస్టులో విజయం సాధించాలని భారత్ భావిస్తోంది. మరోవైపు ఇంగ్లాడ్ రెండో టెస్టులోనూ గెలిచి 2-0ఆధిక్యాన్ని దక్కించుకోవాలని చూస్తోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications