For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సంతోషంలో కోహ్లీ భాంగ్రా డ్యాన్స్: నెట్‌లో వీడియో వైరల్

By Nageshwara Rao
WATCH: Virat Kohli does a bhangra after Ravindra Jadeja dismisses Niroshan Dickwella in IND vs SL, 2nd Test

హైదరాబాద్: మూడు టెస్టుల సిరిస్‌లో భాగంగా భారత్-శ్రీలంక జట్ల మధ్య రెండో టెస్టు గురువారం నాగ్‌పూర్ వేదికగా ప్రారంభమైంది. ఈ టెస్టులో టాస్ గెలిచిన శ్రీలంక బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే తొలిరోజు ఆటలో భాగంగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ భాంగ్రా డ్యాన్స్ చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

శ్రీలంక బ్యాట్స్‌మన్ అవుటైన ఆనందంలోనే కోహ్లీ భాంగ్రా డ్యాన్స్ చేసినట్లు తెలుస్తోంది. తొలిరోజు ఇన్నింగ్స్ 60వ ఓవర్‌లో రవీంద్ర జడేజా విసిరిన చివరి బంతి శ్రీలంక బ్యాట్స్‌మన్‌ నిరోషాన్‌ డిక్వెల్లా బ్యాట్‌కి తగిలిన బంతి అమాంతం గాల్లోకి లేవగా.. దానిని ఇషాంత్‌ శర్మ ఒడిసి పట్టుకున్నాడు.

పెవిలియన్‌ వెళ్తున్న డిక్వెల్లాను చూస్తూ కోహ్లీ భాంగ్రా స్టెప్పులేశాడు. అయితే అతడిని చూసి కోహ్లీ ఇలా ఎందుకు డ్యాన్స్ చేశాడో తొలుత అర్ధం కాలేదు. భారత్‌‌తో కోల్‌కతాలో వేదికగా జరిగిన తొలి టెస్టు చివరి రోజు కావాలనే తాను కావాలనే సమయం వృథా చేశానని మ్యాచ్ అనంతరం డిక్వెల్లా చెప్పిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు రెండో టెస్టులో సమయం వృధా చేసేందుకు వీలు లేకుండా పెవిలియన్‌కు చేరడంతో అతడిని చూసి కోహ్లీ ఇలా సంబరాలు చేసుకున్నట్లు తెలుస్తోంది. కొల్ కతా టెస్టులో కోహ్లీసేన గెలవాల్సి ఉన్నప్పటికీ సమయాభావం వల్ల ఆ టెస్టు డ్రాగా ముగిసిన సంగతి తెలిసిందే.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Saturday, November 25, 2017, 15:54 [IST]
Other articles published on Nov 25, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+