భారత ఆర్మీతో కలిసి నాగిని డ్యాన్స్ చేసిన విరాట్ కోహ్లీ (వీడియో)


హైదరాబాద్: ఆసీస్ గడ్డపై తొలిసారి టెస్టు సిరిస్ నెగ్గడంతో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. వర్షం కారణంగా సిడ్నీ టెస్టు డ్రాగా ముగియడంతో విరాట్ కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ను 2-1తో సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
ఆసీస్ గడ్డపై చారిత్రత్మక టెస్టు సిరిస్‌ను కైవసం చేసుకున్న నేపథ్యంలో విరాట్ కోహ్లీ సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌ను డ్యాన్స్‌తో హోరెత్తించిన తర్వాత భారత్ ఆర్మీతో కలిసి హోటల్లోనూ చిందులేశాడు. మేరె దేశ్ కీ ధర్తీ పాటపై కోహ్లీ డ్యాన్స్ చేసిన వీడియోను బీసీసీఐ తన ట్విటర్‌లో అభిమానులతో పంచుకుంది.
భారత ఆర్మీ తనదైన శైలిలో
ఆసీస్ గడ్డపై టెస్టు సిరిస్ విజయం తర్వాత కోహ్లీసేనకు భారత ఆర్మీ తనదైన శైలిలో ఉత్సాహాపరించింది. ఈ సందర్భంగా కెప్టెన్ విరాట్ కోహ్లీ భారత్ ఆర్మీ సభ్యులతో కలిసి డ్యాన్స్ చేశాడు. సిడ్నీ టెస్ట్‌లోనూ గెలిచే అవకాశం ఉన్నా.. వర్షం కారణంగా మ్యాచ్ డ్రాగా అంఫైర్లు ప్రకటించడంతో కోహ్లీ సేన సరికొత్త చరిత్రను సృష్టించింది.
తొలి ఆసియా కెప్టెన్‌గా కోహ్లీ
ఆసీస్ గడ్డపై టెస్టు సిరిస్ విజయంతో ఈ ఘనత సాధించిన తొలి భారత, ఆసియా కెప్టెన్‌గానూ విరాట్ కోహ్లీ రికార్డుల్లో నిలిచాడు. 72 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఆస్టేలియాలో టెస్టు సిరీస్ గెలవడంతో భారత్ క్రికెటర్లు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. ‘భారత్ ఆర్మీ' అభిమానులు వినసొంపైన సంగీతంతో మైదానంలోని ఆటగాళ్లలో ఉత్సాహం నింపారు.
వర్షం కారణంగా
ఈ సిరీస్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచిన పుజారాకి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్', ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్' అవార్డులను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. సిడ్నీ వేదికగా ప్రారంభమైన చివరి టెస్టులో టీమిండియా విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ వర్షం పదే పదే అంతరాయ కలిగించడంతో పూర్తి ఆట సాధ్యం కాలేదు. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 622/7 డిక్లేర్ చేయగా, ఆసీస్ తన మొదటి ఇన్నింగ్స్‌లో 300 పరుగులకు ఆలౌటైంది.
చివరిరోజు ఒక్క బంతి కూడా పడలేదు
దీంతో ఆస్ట్రేలియాను కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫాలో ఆన్‌కు ఆహ్వానించాడు. నాలుగో రోజైన ఆదివారం ఆటలో ఆస్ట్రేలియా వికెట్ కోల్పోకుండా ఆరు పరుగుల వద్ద ఉన్న సమయంలో వర్షం పడింది. చివరి రోజు ఆటకు సైతం వరుణుడు అడ్డుపడటంతో ఒక్క బంతి కూడా పడలేదు. దాంతో సిడ్నీ టెస్టు డ్రాగా ముగిసింది. సిడ్నీ టెస్టులో సెంచరీ సాధించిన ఛటేశ్వర్ పుజారా(193) మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుతో పాటు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications