బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ, విధ్వంసక బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్ తమ నృత్యం ఉర్రూతలూగించారు. కొత్త కొత్త స్టెప్పులతో పోటాపోటీగా డ్యాన్స్ చేస్తూ ఆకట్టుకున్నారు.
ఇప్పుడు ఈ వీడియో సోసల్ మీడియాల్ హల్‌చల్ చేస్తోంది. ఇటీవల ముగిసిన టీ20 వరల్డ్‌కప్‌లో విండీస్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో డీజేగా అవతారమెత్తిన విషయం తెలిసిందే. ఆ టోర్నీలో ఛాంపియన్స్ డ్యాన్స్ అంటూ కొత్త పాటను వినిపించాడు. దానికి స్టెప్పులు కూడా వేశాడు.

కాగా, ఇప్పుడదే ఊపును తాజాగా కార్యక్రమంలో చూపించారు బెంగళూరు ఆటగాళ్లు. షేన్ వాట్సన్ గిటార్ వాయిస్తుంటే.. క్రిస్ గేల్, విరాట్ కోహ్లీలు డాన్స్ చేశారు. వాట్సన్ పాట పాడగా.. రాక్ అండ్ రోల్ స్టెప్పులతో గేల్ కేక పుట్టించాడు. గేల్ తోడుగా కోహ్లీ రెచ్చిపోయి స్టెప్పులేసి అదరగొట్టాడు.