న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

స్వదేశానికి చేరుకున్న కోహ్లీ: సెలక్షన్ కమిటీ సమావేశం వాయిదా!

Kohli And Anushka Return Home After World Cup Exit || Oneindia Telugu
 Watch: Virat Kohli, Anushka Sharma Return Home After Indias World Cup Exit

హైదరాబాద్: ప్రపంచకప్ ముగిసిన తర్వాత విరుష్క దంపతులు స్వదేశానికి చేరుకున్నారు. గురువారం కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు అతడి భార్య, బాలీవుడ్ నటి అనుష్క శర్మ ముంబైలోని ఛత్రపతి అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యారు. దీంతో అభిమానులు ఒక్కసారిగా వారిని చుట్టుముట్టారు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

తొలి సెమీఫైనల్లో 18 పరుగుల తేడాతో ఓటమి

తొలి సెమీఫైనల్లో 18 పరుగుల తేడాతో ఓటమి

మాంచెస్టర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి సెమీఫైనల్లో 18 పరుగుల తేడాతో ఓటమిపాలై టీమిండియా ప్రపంచకప్‌ నుంచి నిష్క్రమించింది. అయితే, బీసీసీఐ వెంటనే టికెట్లు ఏర్పాటు చేయకపోవడంతో భారత జట్టులోని ఆటగాళ్లు కొన్ని రోజులు ఇంగ్లాండ్‌లోనే ఉండాల్సిన పరిస్థితి తలెత్తింది.

స్వదేశానికి చేరుకున్న కోహ్లీ

స్వదేశానికి చేరుకున్న కోహ్లీ

దీంతో గురువారం విరుష్క దంపతులు సైతం స్వదేశానికి చేరుకున్నారు. మరోవైపు విరాట్ కోహ్లీ కోసం సెలక్షన్ కమిటీ సమావేశం వాయిదా పడినట్టు తెలుస్తోంది. వెస్టిండిస్ పర్యటన కోసం శుక్రవారం టీమిండియాను ఎంపిక చేయాల్సి ఉంది. అయితే, ఈ సమావేశం చివరి నిమిషంలో వాయిదా పడింది.

సెలక్షన్ కమిటీ సమావేశం వాయిదా

శుక్రవారం జరగనున్న సెలక్షన్ కమిటీ సమావేశానికి కోహ్లీ హాజరయ్యే పరిస్థితి లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. శనివారం లేదంటే ఆదివారం తిరిగి సెలక్షన్ కమిటీ సమావేశమై విండీస్ టూర్‌కు జట్టును ఎంపిక చేయనున్నట్టు తెలుస్తోంది. వెస్టిండిస్ పర్యటనలో భాగంగా టీమిండియా మూడు వన్డేలు, మూడు టీ20లు, రెండు టెస్టు మ్యాచ్‌లు విండీస్‌తో తలపడనుంది.

Story first published: Friday, July 19, 2019, 7:21 [IST]
Other articles published on Jul 19, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X