Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఫ్యాన్స్ ఫిదా: కోహ్లీ-అనుష్క కలిసి నటించిన వెడ్డింగ్ యాడ్ (వీడియో)

హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మతో కలిసి ఓ యాడ్‌లో నటించాడని గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ యాడ్‌లో వీరిద్దరి మధ్య లవ్ కెమిస్ట్రీ బాగుందని, యాడ్‌కు సంబంధించిన కొన్ని ఫోటోలు ఇనిస్టాగ్రామ్‌లో వైరల్ అయ్యాయి.

అయితే ఆ యాడ్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు బయటకు వచ్చాయి. ప్రముఖ దుస్తుల కంపెనీ మాన్యవర్ తన 'మోహే' బ్రాండ్‌కు అనుష్క శర్మను ఇటీవల ప్రచారకర్తగా నియమించింది. ఇందులో భాగంగా కోహ్లీ-అనుష్క కలిసి నటించిన యాడ్ ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

Watch: Virat Kohli, Anushka Sharma exchange new-age wedding vows

ఈ వీడియోలో ఓ పెళ్లి వేడుకకు సంప్రదాయ దుస్తుల్లో హాజరైన కోహ్లీ-అనుష్కల జోడీ ఎంతో చూడముచ్చటగా ఉంది. సుమారు నిమిషం 30 సెకన్ల పాటు ఉన్న ఈ వీడియోను చూసిన నెటిజన్లు వీరిద్దరి మధ్య ఉన్న లవ్ కెమిస్ట్రీని చూసి ఫిదా అయిపోతున్నారు. అనుష్క శర్మ, విరాట్ కోహ్లీలు కలిసి నటించిన రెండో యాడ్ ఇది.

ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే వీరిద్దరూ తొలిసారి కలిసింది కూడా ఒక యాడ్‌ షూటింగ్‌లోనే. 2013లో ఓ హేయిర్‌ షాంపో యాడ్‌లో వీరిద్దరూ కలిసి తొలిసారి నటించారు. ఆ తర్వాత వీరిద్దరి ప్రేమలో పడ్డారు.

Story first published: Monday, November 13, 2017, 12:17 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+