
హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మల ముంబై రిసెప్షన్ మంగళవారం అంగరంగ వైభవంగా జరిగింది. ముంబై లోయర్ పర్ల్‌లోని రెజీస్ ఆస్టర్ బాల్‌రూమ్‌లో జరిగిన ఈ వివాహ విందుకు అటు బాలీవుడ్, ఇటు క్రికెట్ ప్రముఖులు హాజరయ్యారు.
అట్టహాసంగా సాగిన ఈ వివాహ విందు కార్యక్రమంలో బాలీవుడ్ తారలు, భారత జట్టు క్రికెటర్లు విరుష్క జోడీతో డ్యాన్స్ చేశారు. ఈ వివాహ విందులో బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ విరుష్కతో చేసిన డ్యాన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ వేడుకలో షారుక్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ సాంగ్ 'చెయ్య చెయ్య చెయ్యా' పాటకు కోహ్లీ, అనుష్క, షారుక్‌లు చిందేశారు.
ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. మంగళవారం రాత్రి 8.30 గంటలకు మొదలైన ఈ వివాహ విందు వేడేకు, అర్ధరాత్రి దాటేవరకు కొనసాగింది. కోహ్లీ సైతం యువీ, హర్భజన్‌లతో కలిసి పంజాబీ నృత్యంతో అలరించాడు.
ఈ వేడుకకు అనుష్క బంగారు వర్ణంతో తయారు చేసిన లెహంగా ధరించగా, తెల్లని కుర్తాపై డాప్లర్ బ్లూ బ్లేజర్‌ను విరాట్ కోహ్లీ ధరించాడు. తాజాగా ముంబైలో జరిగిన వివాహ విందుకు కూడా శిఖర్ ధావన్ తన కుటుంబంతో కలిసి హాజరయ్యాడు. ఇదిలా ఉంటే విరుష్క జోడీ ముంబై రిసెప్షన్‌కు క్రికెట్ దిగ్గజం సచిన్ భార్య అంజలి, కుమార్తె సారాతో కలిసి హాజరయ్యాడు.
ఇక, సునీల్ గవాస్కర్, అనిల్ కుంబ్లే, మాజీ కెప్టెన్ ధోని, రోహిత్ శర్మ సతీ సమేతంగా హాజరు కాగా... జడేజా, పుజారా, కుల్దీప్, మనీష్ పాండే, చాహల్, అశ్విన్, ఉనాద్కట్, బుమ్రా, ఉమేశ్ కూడా కార్యక్రమానికి విచ్చేశారు. బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
బాలీవుడ్ నుంచి అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య, షారుక్ ఖాన్, ఏఆర్ రెహమాన్, శ్రీదేవి, రేఖ, మాధురీ దీక్షిత్, షారూఖ్, రణ్‌బీర్ కపూర్, అభిషేక్, ఐశ్వర్య, కత్రినా కైఫ్, కంగనా రనౌత్, లారా దత్తా, మహేష్ భూపతి, నీతా అంబానీ, మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ హాజరయ్యారు.
పాత విభేదాలను పక్కనబెడుతూ భారత మాజీ కోచ్ అనిల్ కుంబ్లే సతీసమేతంగా ఈ వివాహ విందుకు హాజరవడం క్రికెట్ వర్గాల్లో ఆశ్చర్యాన్ని కలిగించింది. డిసెంబరు 11న ఇటలీలోని టస్కనీలో కుటుంబ సభ్యుల మధ్య విరాట్ కోహ్లీ, అనుష్క పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.