వరల్డ్‌కప్ జట్టులో చోటు: విజయ్ శంకర్ రియాక్షన్ ఇదీ (వీడియో)

హైదరాబాద్: వన్డే వరల్డ్‌కప్ కోసం బీసీసీఐ ఎంపిక చేసిన భారత జట్టులో టీమిండియా ఆల్ రౌండర్ విజయ్ శంకర్ చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఇంగ్లాండ్ వేదికగా మే30 నుంచి జరగనున్న వన్డే వరల్డ్‌కప్ కోసం భారత జట్టుని సోమవారం సెలక్టర్లు ప్రకటించారు. మొత్తం 15 మందితో కూడిన భారత జట్టుని టీమిండియా చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ నాయకత్వంలోని సెలక్షన్ కమిటీ సోమవారం ప్రకటించింది.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం
ఈ జట్టులో అంబటి రాయుడు, అజ్యింకె రాహానేలను కాదని సెలక్టర్లు విజయ్ శంకర్‌వైపు మొగ్గు చూపారు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2019 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తోన్న విజయ్ శంకర్ వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కించుకోవడంపై సంతోషం వ్యక్తం చేశాడు. తన కెరీర్‌లో తొలి వరల్డ్ కప్ ఆడబోతున్న విజయ్ శంకర్ తన ఆనందాన్ని ట్విట్టర్ వేదికగా తెలిపాడు.
చాలా సంతోషంగా ఉంది
"వరల్డ్‌కప్ జట్టులో చోటు దక్కించుకోవడం చాలా సంతోషంగా ఉంది. వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నీలో ఆడేందుకు నాకు పిలుపు రావడం ఇదే తొలిసారి. ఇది ఏ క్రికెటర్‌కైనా ఎంతో ప్రత్యేకం. నాకూ అంతే. ఓ అద్భుతమైన పర్యటన కోసం ఎదురుచూస్తున్నా" అంటూ విజయ్ శంకర్ చెప్పిన వీడియోని సన్ రైజర్స్ హైదరాబాద్ తన ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకుంది.

ఆల్ రౌండర్‌గా అద్భుత ప్రదర్శన
ఈ ఏడాది మొదట్లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో పర్యటించిన భారత జట్టులో చోటు దక్కించుకున్న విజయ్ శంకర్ ఆల్ రౌండర్‌గా అద్భుత ప్రదర్శన చేశాడు. ఇప్పటివరకు భారత్ తరుపున మొత్తం 9 వన్డేలాడిన విజయ్ శంకర్ 33 యావరేజితో 165 పరుగులు చేశాడు. ఇక, బౌలింగ్‌లో సైతం 5.61 ఎకానమీతో అదరగొట్టాడు.
2019 వరల్డ్‌కప్‌లో ఆడబోయే భారత జట్టిదే:
విరాట్ కోహ్లీ(కెప్టెన్), రోహిత్ శర్మ(వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, విజయ్ శంకర్, మహేంద్ర సింగ్ ధోనీ, కేదార్ జాదవ్, దినేశ్ కార్తిక్, యుజువేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ.
సీఓఏ ప్రత్యేకంగా సమావేశమైన సెలక్షన్ కమిటీ
వన్డే వరల్డ్‌కప్ కోసం జట్టుని ప్రకటించడానికి ముందు సెలక్టర్లు సోమవారం ఉదయం సుప్రీంకోర్టుచే నియమింపబడిన బీసీసీఐ పాలకుల కమిటీ(సీఓఏ)తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీతో పాటు ఈ సమావేశానికి కెప్టెన్ విరాట్ కోహ్లీ హాజరయ్యాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications