న్యూఢిల్లీ: టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ తన జిమ్‌లో చెమటోడుస్తున్నాడు. ఇప్పటికే ఎనిమిది పలకల శరీరాకృతిని తయారు చేసుకున్న కోహ్లీ.. తన భారీ కసరత్తులను కొనసాగిస్తూనే ఉన్నాడు. దీంతో ఈ టీమిండియా అందగాడు సినీ స్టార్లకు తీసిపోని విధంగా తయారవుతున్నాడు.
కాగా, వెయిట్ లిఫ్టింగ్ చేస్తున్న వీడియోలను విరాట్ కోహ్లీ తన ఇన్‌స్టాగ్రాంలో పోస్టు చేశాడు. తన శరీరాన్ని ఫిట్ గా ఉంచుకునేందుకు విరాట్ ఎంతో కష్టపడుతున్నాడు.
మైదానంలో చురుకుగా ఉండేందుకు, మంచి ఫిట్నెస్ కోసం విరాట్ కోహ్లీ ఇలా జిమ్‌లో శ్రమిస్తున్నాడు. ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారి హల్చల్ చేస్తోంది. కాగా, కోహ్లీ ఇప్పుడు దేశంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌గా కొనసాగుతున్నాడు.