ముంబై: గత కొద్దిరోజులుగా దూరం దూరంగా ఉంటున్న ప్రేమ పక్షులు విరాట్ కోహ్లీ, అనుష్క శర్మలు మళ్లీ కలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇందుకు విరాట్ కోహ్లీనే ఓ అడుగు ముందుకేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు కారణం ఇటీవల అతడు పాడిన పాటే కారణంగా తెలుస్తోంది.
కాగా, కోహ్లీ, అనుష్కలు దూరంగా ఉంటున్న నేపథ్యంలో ఎక్కడికెళ్లినా ఈ ప్రేమజంటను మీడియా ప్రశ్నలతో ముంచెత్తుతోంది. ఈ విషయమై ఓసారి విరాట్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు కూడా. 'నేనొచ్చిన పని గురించి మాట్లాడండి. వర్క్ విషయంలోనే ప్రశ్నలు అడగండి. అనవసరమైన వాటి గురించి ప్రస్తావించకండి' అంటూ మండిపడ్డాడు.
అయితే ఇప్పుడు విరాట్ అనుష్కను మళ్లీ తన జీవితంలోకి ఆహ్వానించాలనుకుంటున్నాడా? అన్నది చర్చనీయాంశంగా మారింది. ఇటీవల ఓ కార్యక్రమంలో విరాట్ 'తాజ్‌మహల్' చిత్రం నుంచి 'జో వాదా కియా.. వో నిభానా పడేగా..'(మాట ఇచ్చినప్పుడు కట్టుబడి ఉండాలి) పాట పాడాడు.
కాగా, విరాట్ పాటను యువరాజ్ సింగ్ రికార్డ్ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. అయితే పాటతో కోహ్లీ.. అనుష్కకు ఏదైనా సందేశం పంపాడా? అనేదానిపై చర్చనీయాంశంగా మారింది. మరి కోహ్లీ పాటను అనుష్క చూసిందా? లేదా? చూస్తే ఏదైనా స్పందిస్తుందో? లేదో వేచిచూడాలి.