For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆల్ టైమ్ గ్రేట్ వసీం అక్రమ్ మెచ్చిన బౌలింగ్ బుడుతడు వీడే (వీడియో)

By Nageshwara Rao
Watch: Video of promising young Pakistan bowler goes viral and catches the attention of all-time great Wasim Akram

హైదరాబాద్: ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ బౌలర్లను అందించిన జట్లలో పాకిస్థాన్ ఒకటి. అప్పటి వసీం అక్రమ్, వకార్ యూనిస్ నుంచి నేటి మహమ్మద్ ఆమీర్ వరకు ఎంతో మంది ఫాస్ట్ బౌలర్లు ఆ జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించారు. అలాంటి పాకిస్థాన్ ఆల్ టైమ్ గ్రేట్ వసీం అక్రమ్ ఓ బుడతడి గురించి ఆరా తీస్తున్నాడు.

నిండా పదేళ్లు కూడా లేని ఓ బుడతడు తన అద్భుతమైన బౌలింగ్‌తో వసీం అక్రమ్‌ని పడగొట్టాడు. ఈ బుడతడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నిమిషం నిడివి ఉన్న ఆ వీడియోలో ఆ బుడతడు ధాటిగా 17 బంతులను విసిరాడు. అందులో 7 సింగిల్‌ స్టంప్‌ను ఎగిరేయగా, మిగతావి తప్పిపోయాయి.

ఫైజాన్‌ రంజాన్‌ అనే యువకుడు దీనిని ట్విట్టర్‌లో పోస్టు చేయగా.. చిన్నారి బౌలింగ్‌ యాక్షన్‌‌కు ఫిదా అయిన అక్రమ్‌ తన ట్విట్టర్‌లో ట్వీట్‌ చేశారు. 'ఇలాంటి టాలెంట్‌ దేశానికి అవసరమని.. ఈ చిన్నారి ఎక్కడ ఉన్నాడో ఎవరికైనా తెలిస్తే చెప్పండంటూ' తన ట్విట్టర్‌లో ట్వీట్‌ చేశాడు.

ఇక ఈ వీడియో చూసిన అక్రమ్‌ భార్య షానెరియా 'బహుశా అతను మరో అక్రమ్‌ ఏమో?' అంటూ కామెంట్‌ చేసింది. పాక్ ఆల్ టైమ్ గ్రేటెస్ట్ బౌలర్లలో వసీం అక్రమ్ ఒకడు. 104 టెస్టుల్లో 414 వికెట్లు... 356 వన్డేల్లో 502 వికెట్లు తీసిన అక్రమ్ తన సుదీర్ఘ కెరీర్‌లో పాక్‌కు ఎన్నో ఘన విజయాలను అందించాడు.

Story first published: Friday, March 2, 2018, 10:16 [IST]
Other articles published on Mar 2, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+