సీఎస్‌కే ఓటమి: గంతులేస్తూ ఏడ్చేసిన అభిమాని (వీడియో)

హైదరాబాద్: ఐపీఎల్ 12 సీజన్ ముగిసింది. టైటిల్ విజేతగా ముంబై ఇండియన్స్ నిలిచింది. ఉప్పల్ వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఒక పరుగు తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఆఖరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో చెన్నై ఓటమి పలువురు అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసింది.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ 2019 ప్రత్యేక వార్తల కోసం
ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో ఆఖరి ఓవర్ ముందు వరకు విజయం చెన్నై సూపర్ కింగ్స్‌దేనని అంతా భావించారు. ఆఖరి ఓవర్‌లో చెన్నై విజయానికి 9 పరుగులు అవసరమయ్యాయి. 76 పరుగులతో షేన్ వాట్సన్ సూపర్ ఫామ్‌లో ఉండగా... అతనికి తోడు రవీంద్ర జడేజా క్రీజులో ఉన్నాడు.

ఆఖరి బంతికి ముంబై విజయం
దీంతో చెన్నై తప్పక విజయం సాధిస్తుందని మ్యాచ్‌ని వీక్షించేవారంతా భావించారు. అయితే, లసిత్ మలింగ వేసిన ఆఖరి ఓవర్‌లో అంతా తారుమైంది. మొదటి మూడు బంతుల్లో చెన్నై నాలుగు పరుగులు చేసింది. డబుల్ సాధించే క్రమంలో షేన్ వాట్సన్ రనౌట్‌గా పెవిలియన్‌కు చేరాడు. ఆఖరి బంతికి రెండు పరుగులు అవసరమైన దశలో ఇరు జట్ల శిబిరాల్లోనూ ఉత్కంఠ నెలకొంది.
నాలుగోసారి ఐపీఎల్ ట్రోఫీని సొంతం చేసుకున్న ముంబై
దీంతో అందరూ సూపర్ ఓవర్ ఖాయమేనని అనుకున్నారు. అయితే, ఆఖరి బంతికి చెన్నై విజయానికి 2 పరుగులు అవసరమైన దశలో శార్ధూల్ ఠాకూర్ అనూహ్యంగా ఔటయ్యాడు. దీంతో ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఒక పరుగు తేడాతో విజయం సాధించి నాలుగో సారి ఐపీఎల్ ట్రోఫీని సొంతం చేసుకుంది. అప్పటివరకు మ్యాచ్‌ని చూస్తున్న ఓ అభిమానికి చెన్నై ఓడిపోయిందని తెలియగానే ఏడ్చేశాడు.

ఎగురుకుంటూ గంతులేస్తూ ఏడిచిన సీఎస్‌కే అభిమాని
ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోలో ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌ని వీక్షిస్తోన్న ఓ బాలుడు అమాంతం కుర్చీలో నుంచి పైకి లేచి ఎగురుకుంటూ గంతులేస్తూ ఏడుస్తుండటాన్ని మనం చూడొచ్చు. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఒక పరుగు తేడాతో విజయం సాధించి నాలుగో సారి ఐపీఎల్ ట్రోఫీని సొంతం చేసుకుంది.

చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ
తద్వారా నాలుగు ఐపీఎల్ ట్రోఫీలు గెలిచిన కెప్టెన్‌గా రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 149 పరుగులు చేసింది. అనంతరం 150 పరుగుల లక్ష్య చేధనలో చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 148 పరుగులకే పరిమితమైంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications