క్రికెట్‌కు వీడ్కోలు: ఆర్టిస్ట్‌గా కెరీర్‌ను ప్రారంభించనున్న ధోని (వీడియో)

హైదరాబాద్: మహేంద్ర సింగ్ ధోని... భారత క్రికెట్ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు. తన ఆటతీరుతో ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న ధోని అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత ఆర్టిస్ట్‌గా స్థిరపడాలని అనుకుంటున్నట్ల తన మనసులోని మాటను బయటపెట్టాడు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ 2019 ప్రత్యేక వార్తల కోసం
ధోనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వీడియోలో అభిమానులు ఆశ్చర్యపోయే విషయాలను ధోని వెల్లడించాడు. అభిమానులకో ఓ సీక్రెట్‌ను పంచుకోవాలని చెప్పిన ధోని... చిన్నప్పటి నుంచి తాను ఆర్టిస్ట్‌ను కావాలని కోరుకున్నట్లు వెల్లడించాడు.
క్రికెటర్‌ను అవడం వల్ల
అయితే, తాను క్రికెటర్‌ను అవడం వల్ల ఎంతో క్రికెట్‌ను ఆడానని, ప్రస్తుతం తాను ఏమి కావాలని అనుకున్నానో అది చేసేందుకు సమయం దొరికిందని ధోని చెప్పుకొచ్చాడు. దీంతో తాను పెయింటింగ్ చేస్తున్నానని, ఇప్పటికే పలు పెయింటిగ్స్ వేసినట్లు... దీనిని తన కెరీర్‌గా ఎంచుకోనున్నట్లు ధోని తెలిపాడు.
త్వరలోనే ఆర్ట్ ఎగ్జిబిషన్‌ను
త్వరలోనే తాను ఆర్ట్ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించనున్నట్లు అయితే... ఇందుకు కొంత సమయం కావాలని చెప్పిన ధోని, తాను వేసిన కొన్ని పెయింటింగ్స్‌ను అభిమానులకు చూపించాడు. ఈ పెయింటింగ్స్ అభిమానులకు తప్పక నచ్చుతాయని... కొన్ని పెయింటింగ్స్‌ను చూపించాడు.
వీడియో వైరల్
ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. కాగా, కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా బుధవారం వన్డే వరల్డ్‌కప్ కోసం ఇంగ్లాండ్‌కు పయనం కానుంది. ఈ వరల్డ్‌కప్‌లో అటు వికెట్ కీపర్‌గా, ఇటు బ్యాట్స్‌మన్‌గా ధోని కీలకపాత్ర పోషించే అవకాశం ఉంది.

ఫేవరేట్ జట్లలో టీమిండియా ఒకటి
వరల్డ్‌కప్‌లో టైటిల్ ఫేవరేట్ జట్లలో టీమిండియా ఒకటి. కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా గత కొన్నేళ్లుగా మంచి ప్రదర్శన చేస్తోంది. కాగా, 20 ఏళ్ల తర్వాత మరోసారి వన్డే వరల్డ్‌కప్‌కు ఇంగ్లాండ్ వేదికగా మారింది. ప్రస్తుతం జరుగుతున్న వన్డే వరల్డ్‌కప్ 12వ ఎడిషన్ కావడం విశేషం.

మే30 నుంచి జులై 14వరకు
మే30 నుంచి జులై 14వరకు జరగనున్న ఈ మెగా టోర్నీలో మొత్తం 10 జట్లు పాల్గొంటున్నాయి. మొత్తం 46 రోజుల పాటు జరిగే ఈ మెగా టోర్నీకి ఇంగ్లాండ్ ఆతిథ్యమివ్వడం ఇది ఐదోసారి(1975, 1979, 1983, 1999). యుకేలోని మొత్తం 11 వేదికల్లో 46 రోజుల పాటు మొత్తం 48 మ్యాచ్‌లు జరగనున్నాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications