టాస్ వేసిన శ్రేయాస్ అయ్యర్: పడి పడి నవ్విన ధోని (వీడియో)

హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మైదానంలో ఎంత కూల్‌గా ఉంటాడో మనందరికీ తెలిసిందే. తాజాగా ఓ సంఘటన ధోనిని కడుపుబ్బా నవ్వేలా చేసింది. ఐపీఎల్ టోర్నీలో భాగంగా శుక్రవారం రాత్రి ఢిల్లీ డేర్‌డెవిల్స్-చెన్నై సూపర్‌కింగ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ సన్నివేశం చోటు చేసుకుంది.
మ్యాచ్ ప్రారంభానికి ముందు ఇరు జట్లకు చెందిన కెప్టెన్లు ధోనీ, శ్రేయాస్ అయ్యర్ మైదానంలోకి వచ్చారు. ఢిల్లీ డేర్‌డెవిల్స్ సొంత మైదానం కావడంతో శ్రేయాస్ టాస్ కోసం కాయిన్‌ను ఎగురవేశాడు. ఆ కాయిన్ ఆటగాళ్లకు చాలా దూరంలో వెళ్లి పడింది. దీంతో ధోనీ నవ్వు ఆపుకోలేకపోయాడు.
కాసేపు నవ్వుతూ కనిపించాడు. ధోనీతో పాటు ప్రజంటేటర్ సైమన్ డౌల్ కూడా నవ్వాడు. అనంతరం టాస్ గెలిచిన ధోనీ ఫీల్డింగ్ ఎంచుకుంటున్నట్లు ప్రకటించాడు. ఇందుకు సంబంధించిన వీడియోని బీసీసీఐ తన ఐపీఎల్ వెబ్ సైట్‌లో అభిమానులతో పంచుకుంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications