Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సూర్యుడి వల్లే ఆ ఈజీ క్యాచ్‌ని పట్టలేకపోయా: సోషల్ మీడియాలో నెటిజన్ల జోకులు

WATCH VIDEO: Gulbadin Naib TROLLED Hilariously For Dropping Easy Catch During West Indies vs Afghanistan Match

హైదరాబాద్: ప్రపంచకప్‌లో భాగంగా గురువారం వెస్టిండిస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆప్ఘనిస్థాన్ జట్టు 23 పరుగుల తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే. తద్వారా ఈ ప్రపంచకప్‌లో ఆప్ఘనిస్థాన్ ఆడిన అన్ని మ్యాచ్‌ల్లోనూ ఓడిన జట్టుగా నిలిచింది. అయితే, గురువారం విండిస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆప్ఘన్ కెప్టెన్ గుల్బదిన్ నైబ్ ఈజీ క్యాచ్‌ వదిలేయడంతో సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

అసలేం జరిగింది?

సయద్‌ షిర్జాద్‌ వేసిన ఆఖరి ఓవర్‌లో వెస్టిండిస్ బ్యాట్స్‌మన్‌ కార్లోస్‌ బ్రాత్‌వైట్‌ బ్యాటంగ్ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో బ్రాత్‌వైట్‌ కొట్టిన ఓ బంతి అమాంతం గాల్లోకి లేచింది. లాంగ్‌ ఆఫ్‌ మీదుగా భారీ షాట్‌ ఆడడంతో బౌండరీ వద్ద ఉన్న ఆప్ఘన్ కెప్టెన్ గుల్బదిన్ బంతిని అందుకోడానికి వచ్చి చేతులెత్తేశాడు. దీంతో బంతి బౌండరీని తాకింది.

సోషల్ మీడియాలో వీడియో వైరల్

ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే, ఆ సమయంలో సూర్యుడు వల్లే బంతి కనబడలేదని, దాంతో తాను క్యాచ్ పట్టలేకపోయానని ఆప్ఘన్ కెప్టెన్ అన్నాడు. అతడు చెప్పిన సాకును తప్పుబడుతూ నెటిజెన్లు అతడిపై మండి పడుతున్నారు.

గుల్బదిన్ క్యాచ్ మిస్

గుల్బదిన్ క్యాచ్ మిస్ చేసిన వీడియోని సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ అతడిని విమర్శిస్తున్నారు. ఈ మ్యాచ్‌లో ఆప్ఘన్ 23 పరుగుల తేడాతో ఓటమి పాలైన ఈ ప్రపంచకప్‌లో ఒక్క మ్యాచ్ కూడా గెలవకుండా టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఆప్ఘన్ ఆడిన తొమ్మిదింటిలో ఒక్కటి కూడా విజయం సాధించలేదు.

Story first published: Friday, July 5, 2019, 12:29 [IST]
Other articles published on Jul 5, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+