For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పాకిస్థాన్‌తో మ్యాచ్: క్రిస్ వోక్స్ సూపర్ క్యాచ్‌ చూశారా? (వీడియో)

Watch Video: Chris Woakes Takes a Brilliant Diving Catch to Dismiss Imam-ul-Haq

హైదరాబాద్: నాటింగ్‌హామ్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న వన్డే మ్యాచ్‌లో దూకుడుగా ఆడుతోన్న పాక్ ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్‌ను క్రిస్ వోక్స్ సూపర్ క్యాచ్‌తో పెవిలియన్‌కు చేర్చాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ పాకిస్థాన్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించిన సంగతి తెలిసిందే.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

పాక్ ఓపెనర్లు చక్కటి భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. వీరిద్దరూ కలిసి తొలి వికెట్‌కు 82 పరుగులు జోడించిన తర్వాత ఫకర్ జమాన్ 40 బంతుల్లో 36(6 ఫోర్లు) మొయిన్ అలీ బౌలింగ్‌లో స్టంపౌట్ ఔట‌య్యాడు. కీప‌ర్ జోస్ బ‌ట్ల‌ర్ అద్భుతంగా స్టంపింగ్‌కు ఫాకర్ జమాన్ పెవిలియన్‌కు చేరాడు.

ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన బాబర్ ఆజాంతో కలిసి మరో ఓపెనర్ ఇమామ్ ఉల్ హాక్ స్కోరు బోర్డుని నడిపించాడు. అయితే, జట్టు స్కోరు 111 పరుగుల వద్ద మొయిన్ అలీ బౌలింగ్‌లో ఇమామ్ ఉల్ హాక్ 58 బంతుల్లో 44 (3 పోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీ ముంగిట క్రిస్ వోక్స్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు.


ఆఫ్ స్టంప్‌కు దూరంగా మెయిన్ అలీ వేసిన బంతిని ఇమామ్ ఉల్ హాక్ అమాంతం గాల్లోకి లేపాడు. అదే సమయంలో బౌండరీ వద్ద ఫీల్డింగ్ చేస్తోన్న క్రిస్ వోక్స్ పరుగెత్తుకొచ్చి బంతిని అందుకోవడం స్టేడియంలో ప్రేక్షకుల్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది. బంతి గమనాన్ని కచ్చితంగా అంచనా వేసిన వోక్స్‌ డైవ్‌కొట్టి మరీ ఒడిసి పట్టుకున్నాడు.

కాగా, టోర్నీలో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌స్టోక్స్‌ అద్భుతమైన క్యాచ్‌ను అందుకున్న సంగతి తెలిసిందే. ఇమామ్ ఉల్ హక్ ఔటైన తర్వాత క్రీజులోకి మహ్మద్ హఫీజ్ వచ్చాడు. ప్రస్తుతం 29 ఓవర్లకు గాను పాకిస్థాన్ 2 వికెట్లు కోల్పోయి 170 పరుగులు చేసింది.

1
43649

క్రీజులో బాబర్ అజాం(56), మహ్మద్ హఫీజ్(20) పరుగులతో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ జట్టు ఒక మార్పుతో బరిలోకి దిగగా... పాక్ రెండు మార్పులు చేసింది. ఇంగ్లాండ్ జట్టులో లియాం ప్లంకెట్ స్థానంలో మార్క్ వుడ్ చోటు దక్కించుకోగా... పాకిస్థాన్ జట్టులో ఇమాద్‌, హారిస్ స్థానంలో ఆసిఫ్ అలీ, షోయబ్ మాలిక్‌లు తుది జట్టులో చోటు దక్కించుకున్నారు.

టోర్నీలో భాగంగా ఇంగ్లాండ్ ఆడిన తన తొలి మ్యాచ్‌లో విజయం సాధించగా.... వెస్టిండిస్‌తో జరిగిన తన తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్ ఓడిపోయింది. దీంతో ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో బరిలోకి దిగుతోంది. మరోవైపు ఈ మ్యాచ్‌లో నెగ్గి తన ఆధిక్యాన్ని మరింతగా పెంచుకోవాలోని ఇంగ్లాండ్ భావిస్తోంది.

Story first published: Monday, June 3, 2019, 17:30 [IST]
Other articles published on Jun 3, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+