నాగపూర్: క్రికెట్‌లో పసికూన అయిన అప్ఘనిస్తాన్ మార్చి 27వ తేదీన వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో చరిత్ర సృష్టించింది. 2012 ట్వంటీ 20 ప్రపంచ కప్ విజేత అయిన వెస్టిండీస్ పైన గెలిచింది. ఈ గెలుపు ఆ జట్టుకు మరిచిపోలేనిది అని చెప్పవచ్చు.
తమ గెలుపు అనంతరం ఆప్ఘనిస్తాన్ ఆటగాళ్లు సంబరాలు చేసుకున్నారు. వెస్టిండీస్ జట్టును ఓడించడం వారు ఊహించలేనిది. అలాంటి అద్భుతంపై వారి ఆనందానికి అంతులేకుండా పోయింది. ఆప్ఘన్ జట్టు మొత్తం డ్యాన్సు చేసింది.
ఈ గెలుపును స్పోర్టివ్‌గా తీసుకున్న వెస్టిండీస్ ఆటగాళ్లు కూడా ఆప్ఘనిస్తాన్ జట్టుతో కలిపి చిందేశారు. అప్ఘన్ జట్టుతో జరిగిన మ్యాచులో క్రిస్ గేల్ ఆడలేదు. అయితే, ఆప్ఘన్ గెలిచిన అనంతరం అతను వచ్చి వారితో కలిపి చిందేశాడు. ఆప్ఘన్ వికెట్ కీపర్ మొహమ్మద్ షహజాద్, ఇతరులతో కలిసి గేల్ డ్యాన్స్ చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అదే వీడియోను ఐసీసీ.. డ్వేన్ బ్రావో కొత్త పాట బ్యాక్ గ్రౌండుతో షేర్ చేసింది.

ఫేవరేట్ అయితే ఏంటి?
ట్వంటీ 20 ప్రపంచ కప్‌లో ఇప్పటికి వరకు ప్రదర్శించిన ఆటతీరును బట్టి అంతా న్యూజిలాండ్‌ను టైటిల్ ఫేవరేట్ అంటున్నారు. టైటిల్ ఫేవరేట్ అయితే ఏమిటని ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ప్రశ్నించాడు. తొలి మ్యాచ్‌లో వెస్టిండీస్ చేతిలో ఓడినప్పటికీ సౌతాఫ్రికా, శ్రీలంక జట్లపై సాధించిన విజయాలను గుర్తు చేశాడు.
టైటిల్ వేటలో తాము ముందున్నామన్నాడు. తమ ముందున్నది ఏ జట్టు అన్నది కాదని, తమకు మైదానంలో ప్రదర్శన ప్రధానమన్నాడు. న్యూజిలాండ్‌తో రసవత్తరమైన పోరాటం తప్పదన్నాడు. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఫేవరేట్ అయినప్పటికీ ఆ ట్యాగ్‌ను తాము పట్టించుకోమన్నాడు.