న్యూఢిల్లీ: ఇటీవల ఛాంపియన్ పాటతో అత్యంత ప్రజాదరణ పొందిన వెస్టిండీస్ ఆల్ రౌండర్ డ్వేన్ బ్రావో మరోసారి తన సత్తా చాటుకున్నాడు. ఐసిసి టీ20 తర్వాత ఇప్పుడు ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో బ్రావో సందడి కొనసాగుతోంది.
తాజాగా, బాలీవుడ్ నటి ఊర్వశి రౌటేలాతో కలిసి పాట పడుతూ డ్యాన్స్ చేశాడు బ్రావో. ఇంతకుముందు మరో బాలీవుడ్ నటి స్నేహా ఉల్లాల్‌తో చిందేసి హల్ చల్ చేసిన బ్రావో.. ఇప్పుడు ఊర్వశితో కలిసి పాట పాడటంతోపాటు డ్యాన్స్ చేసి అలరించాడు.
నైట్ క్లబ్‌లో అద్భుతమైన స్టెప్పులేస్తూ ఆకట్టుకున్నాడు. స్నేహా ఉల్లాల్‌తో కలిసి క్రిస్ గేల్, డ్వేన్ బ్రావో చిందేసిన చిత్రాలు ఇటీవల సోషల్ మీడియాలో హల్ చల్ చేసిన విషయం తెలిసిందే.