Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆడిన తొలి బంతికే డుప్లెసిస్ ఔట్: తడబడుతోన్న దక్షిణాఫ్రికా (వీడియో)

WATCH: Umesh Yadav dismisses Faf du Plessis with unplayable delivery in first over of Day 3 in Ranchi

హైదరాబాద్: రాంచీ వేదికగా టీమిండియాతో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌ దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ తడబడుతున్నారు. 9/2 ఓవర్‌నైట్‌ స్కోరుతో మూడో రోజు ఇన్నింగ్స్‌ను కొనసాగించిన దక్షిణాఫ్రికాకు ఆరంభంలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆడిన తొలి బంతికే దక్షిణాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్ ఔటయ్యాడు.

మూడో రోజు ఆటలో భాగంగా ఉమేశ్‌ యాదవ్‌ వేసిన తొలి ఓవర్‌ నాలుగు బంతుల్ని హమ్జా ఆడగా, ఐదో బంతిని డుప్లెసిస్‌ ఎదుర్కొన్నాడు. అయితే, ఉమేశ్ యాదవ్ వేసిన బంతిని అంచనా వేయడంలో విఫలమైన డుప్లెసిస్‌ పెవిలియన్‌కు చేరాడు. దీంతో దక్షిణాఫ్రికా 16 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

డుప్లెసిస్‌ ఆదివారం ఆటతో కలుపుకుని తొమ్మిది బంతులు ఆడి కేవలం ఒక పరుగు మాత్రమే చేశాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన బవుమా(32), హంజా(62) పరుగులతో ఫరవాలేదనిపించాడు. మూడో రోజు పిచ్ బౌలర్లకు సహకరిస్తుండటంతో భారత్ బౌలింగ్‌ను ఎదుర్కోవడానికి సఫారీ బ్యాట్స్‌మెన్ ఇబ్బంది పడుతున్నారు.

ప్రస్తుతం దక్షిణాఫ్రికా 31 ఓవర్లకు గాను 5 వికెట్లు కోల్పోయి 115 పరుగులు చేసింది. క్రీజులో జార్జి లిండే(3), హెన్రిచ్ క్లాసిన్(5) పరుగులతో క్రీజులో ఉన్నారు. దక్షిణాఫ్రికా కోల్పోయిన ఐదు వికెట్లలో భారత్ బౌలర్లలో ఉమేష్ యాదవ్ రెండు వికెట్లు, షమీ రెండు, రవీంద్ర జడేజాకు ఒక వికెట్ దక్కింది.

Story first published: Monday, October 21, 2019, 11:36 [IST]
Other articles published on Oct 21, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+