Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అసలేం జరిగింది?: ట్రాఫిక్ పోలీసులతో క్రికెటర్ గొడవ

హైదరాబాద్: పాకిస్థానీ క్రికెటర్ ఉమర్ అక్మల్ మరోసారి పోలీసులతో గొడవకు దిగాడు. గతంలో లాహోర్‌లోని గడాఫీ స్టేడియం లోపలకు తన కారును వెళ్లకుండా అడ్డుకున్నందకు గేటు బయటి వాచ్‌మెన్‌తో గొడవకు దిగిన అక్మల్, తాజాగా గురువారం పోలీసులతో గొడవపడ్డాడు.

ఇటీవలే యూఏఈలో పాకిస్థాన్ సూపర్ లీగ్ టోర్నీ ముగించుకుని తన స్వస్థలమైన లాహోర్‌కు చేరుకున్నాడు. గురువారం లాహోర్‌లో అక్మల్‌ ప్రయాణించే కారుకి ఉన్న నంబరు ప్లేటు రిజిస్టర్‌ చేసింది కాకపోవడంతో, అది గమనించిన ట్రాఫిక్‌ పోలీసులు అతడి కారును ఆపి రోడ్డుపైనే ఆ ప్లేటును తొలగించారు.

Umar Akmal

ఈ క్రమంలో ట్రాఫిక్ పోలీసులకు, అక్మల్‌కి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో అక్కడికి చేరుకున్న మీడియాకు తాను కారులో వెళ్తుంటే పోలీసులే ఆపి తనను అసభ్యపదజాలంతో దూషించారని అక్మల్‌ తెలిపాడు.

గతంలో కూడా 2014 ఫిబ్రవరిలో ట్రాఫిక్‌ సిగ్నల్‌ను పట్టించుకోకుండా వెళ్లిన ట్రాఫిక్ పోలీసులతో అనవసరంగా అక్మల్ గొడవకు దిగాడు. దీంతో అక్మల్ దురుసు ప్రవర్తన కారణంగా ఒక రోజు జైలు శిక్ష కూడా అనుభవించాడు.

Story first published: Monday, November 13, 2017, 12:14 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+