
హైదరాబాద్: బంగ్లాదేశ్‌కు చెందిన రెండేళ్ల అలీ ఆటకు ఐసీసీ సైతం ఫిదా అయింది. ఆఫ్ సైడ్ షాట్స్ కొట్టడంలో ప్రొఫెషనల్ క్రికెటర్లనే మించిపోయాడు ఆ చిన్నారి. అలీ తండ్రి క్రికెట్‌కు వీరాభిమాని. దీంతో తన కుమారుడిని క్రికెటర్‌గా మార్చాలని కలలు కంటున్నాడు.
ఈ క్రమంలో అలీకి చిన్నప్పటి నుంచే క్రికెట్ పాఠాలు నేర్పిస్తున్నాడు. తండ్రి చెప్పినట్లుగానే ఆఫ్ సైడ్ షాట్లు కొడుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. అంతేకాదు అలీ ఆఫ్ సైడ్ షాట్లు కొట్టే విధానం, బ్యాట్‌ను పట్టుకునే తీరు ఐసీసీకి తెగ నచ్చింది. ఇంకేముంది అలీ క్రికెట్ ఆడిన వీడియోను తన అధికారిక ట్విటర్‌లో షేర్ చేసింది.
అంతేకాదు అలీ వీడియోను పోస్ట్ చేసి ఫ్యాన్ ఆఫ్ ద వీక్‌గా ఐసీసీ ఎంపిక చేసింది. "అలీ వయసు రెండేళ్లు, కానీ అతడి ఆఫ్‌సైడ్ టెక్నిక్స్ అద్భుతం.. ఐసీసీ ఫ్యాన్ ఆఫ్ ద వీక్ అలీనే. చాలా అద్భుతంగా ఆడావు అలీ, ఏదో ఒక రోజు బంగ్లాదేశ్ తరుపున ఆడతావు" అంటూ ఐసీసీ ట్వీట్ చేసింది.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆఫ్ సైడ్ షాట్లలో అలీని మించిన ఆటగాడిని ఇప్పటివరకు చూడలేదు అంటూ క్రికెట్ అభిమానులు ట్రోల్ చేస్తున్నారు.