సిక్స్ కొట్టమంటూ రోహిత్ శర్మను రెచ్చగొట్టిన టిమ్ పైన్ (వీడియో)

హైదరాబాద్: మెల్ బోర్న్ వేదికగా ఆస్ట్రేలియా-భారత్ జట్ల మధ్య బుధవారం ప్రారంభమైన బాక్సింగ్ డే టెస్టు మంచి రసవత్తరంగా సాగింది. తొలిరోజు టీమిండియా ఆధిపత్యం సాధించడంతో రెండో రోజైన గురువారం ఆతిథ్య జట్టు స్లెడ్జింగ్‌కు తెరలేపింది. ఇందులో భాగంగా ఆసీస్ కెప్టెన్ టిమ్ పైన్ భారత బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మను రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు.
రెండో రోజు ఆటలో భాగంగా టిమ్ పైన్ తన మాటలతో రోహిత్ శర్మ దృష్టిని మళ్లించే ప్రయత్నం చేశాడు. హాఫ్ సెంచరీతో క్రీజులో పాతుకుపోయిన రోహిత్ సిక్సర్ కొడితే .. ముంబై ఇండియన్స్‌కు తాను మద్దతు ఇస్తున్నట్లు పెయిన్ చెప్పాడు. ఈ మాటలు స్టంప్స్ మైక్‌లో రికార్డు అయ్యాయి.

నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో
నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా పెర్త్ వేదికగా జరిగిన రెండో టెస్టులో ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్ పైన్... విరాట్ కోహ్లీతో వాగ్వాదానికి దిగిన సంగతి తెలిసిందే. అయితే, బాక్సింగ్ డే టెస్టులో కూడా ఆసీస్ కెప్టెన్ మరోసారి స్లెడ్జింగ్‌ను తెరలేపాడు. రోహిత్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో కీపర్‌గా ఉన్న పైన్.. షార్ట్‌మిడ్‌లెగ్‌లో ఉన్న ఆసీస్ ప్లేయర్ ఆరోన్ ఫించ్‌తో మాట్లాడాడు.
ఫించ్‌తో మాట్లాడుతున్నట్లు నటించిన పైన్
నాథన్ లియాన్ బౌలింగ్ చేస్తున్నప్పుడు ఆరోన్ ఫించ్‌తో మాట్లాడుతున్నట్లు పైన్ నటించాడు. అదే సమయంలో బ్యాటింగ్ క్రీజులో ఉన్న రోహిత్ శర్మను తన మాటలతో రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. "ఐపీఎల్‌లో నువ్వు అన్ని జట్లకు ఆడావు కదా? అని ఆరోన్ ఫించ్‌తో టిమ్ పైన్ అన్నాడు. లేదు.. బెంగుళూరుకు ఆడలేదని ఫించ్ చెప్పాడు. అవునా, బెంగుళూరుకు ఆడలేదా. ఇప్పుడు రోహిత్ సిక్సర్ కొడితే, నేను ముంబై ఇండియన్స్‌కు మారిపోతా" అని పైన్ అన్నాడు.

ఎంతో సహనంతో క్రీజులో రోహిత్ శర్మ
అయితే, ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్ పైన్ తన మాటలతో ఎంత రెచ్చగొట్టే ప్రయత్నం చేసినప్పటికీ, రోహిత్ శర్మ మాత్రం ఎటువంటి సహనాన్ని కోల్పోలేదు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో ఇరు జట్ల చెరో మ్యాచ్ గెలవడంతో సిరిస్ 1-1తో సమం అయింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications