For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పెర్త్‌లో రెండో టెస్టు: బుమ్రా వేసిన బంతికి ఆసీస్ కెప్టెన్ మతిపోయింది (వీడియో)

WATCH: Tim Paine in disbelief after facing unplayable delivery from Jasprit Bumrah during 2nd Test

హైదరాబాద్: నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా పెర్త్‌ వేదికగా శుక్రవారం ప్రారంభమైన రెండో టెస్టు తొలి రోజు ఆటలో ఆతిథ్య ఆస్ట్రేలియా పైచేయి సాధించిన సంగతి తెలిసిందే. ఓపెనర్లు చక్కటి శుభారంభం ఇవ్వడంతో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా తొలి రోజు ఆట ముగేసి సమయానికి 6 వికెట్లు కోల్పోయి 277 పరుగులు చేసింది.

ప్రస్తుతం క్రీజులో ఆసీస్ కెప్టెన్‌ టిమ్‌ పైన్‌(16), ప్యాట్‌ కమిన్స్‌(11) పరుగులతో క్రీజులో ఉన్నారు. తొలి రోజు ఆటలో భారత బౌలర్లు హనుమ విహారి, జస్ప్రీత్ బుమ్రాలు అద్భుత ప్రదర్శన చేశారు. ముఖ్యంగా పేస్, బౌన్స్‌కు అనుకూలించే ఈ పిచ్‌పై తొలి సెషన్‌లో పేసర్లు విఫలమైనా.. లంచ్ విరామం తర్వాత చెలరేగారు.

బుమ్రా వేసిన ఓ డెలివరీకి

తమ పదునైన బంతులతో ప్రత్యర్ధి జట్టు బ్యాట్స్‌మెన్‌ను ఒత్తిడికి గురి చేశారు. ఈ మ్యాచ్‌లో టీమిండియా యార్కర్ల స్పెషలిస్ట్ జస్ప్రీత్ బుమ్రా వేసిన ఓ డెలివరీకి ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్ పైన్‌ను మతిపోయేలా చేసింది. అప్పుడు టిమ్ పైన్ 19 బంతుల్లో 7 పరుగులు చేసి క్రీజులో ఉన్నాడు. ఇన్నింగ్స్ 84వ ఓవర్‌లో బుమ్రా వేసిన పుల్ లెంత్ డెలివరీకి టిమ్ పైన్ బ్యాట్‌ని అడ్డుపెట్టగానే అమాంతం బంతి వికెట్ కీపర్ రిషబ్ పంత్ తలపైగుండా బౌండరీని తాకింది. బౌండరీని తాకిన బంతిని చూసి బుమ్రా కాసేపు అలానే మైదానంలో ఉండిపోయాడు. దీనికి సంబంధించిన వీడియోని క్రికెట్ ఆస్ట్రేలియా తన అధికారిక ట్విట్టర్‌‌లో పోస్టు చేసింది.

22 ఓవర్లు వేసిన బుమ్రా ఒక వికెట్ తీసి 41 పరుగులు

ఇదిలా ఉంటే ఈ మ్యాచ్‌లో మొత్తం 22 ఓవర్లు వేసిన బుమ్రా ఒక వికెట్ తీసి 41 పరుగులిచ్చాడు. ఇక, తొలిరోజు మ్యాచ్‌లో అంధ్రా కుర్రాడు హనుమ విహారి అద్భుత ప్రదర్శన చేశాడు. మొత్తం 14 ఓవర్లు వేసిన విహారి 53 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. గాయం కారణంగా రెండో మ్యాచ్‌కి దూరమైన రోహిత్ శర్మ స్థానంలో హనుమ విహారి తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు.

కీలక సమయంలో రెండు వికెట్లు తీసిన విహారి

హనుమ విహారి తీసిన రెండు వికెట్లు కూడా ఎంతో కీలకమైన వికెట్లు. హాఫ్ సెంచరీతో క్రీజులో పాతుకుపోయిన ఓపెనర్ మార్కస్ హారిస్‌(70)ను తొలుత పెవిలియన్‌కు చేర్చిన హనుమ విహారి ఆ తర్వాత షాన్ మార్ష్(45)ను పెవిలియన్‌కు చేర్చాడు. ఈ మ్యాచ్‌లో కీలక సమయంలో భారత బౌలర్లు రాణించినప్పటికీ, ఆట ముగిసే సమయానికి మాత్రం ఆతిథ్య జట్టు పటిష్ట స్థితిలో నిలిచింది.

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆస్ట్రేలియా

శుక్రవారం ఆరంభమైన రెండో టెస్టులో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆస్ట్రేలియాకు మార్కస్‌ హారిస్‌-అరోన్‌ ఫించ్‌లు చక్కటి శుభారంభం ఇచ్చారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 112 పరుగులు జోడించిన తర్వాత ఫించ్‌(50) ఔటయ్యాడు. ఆపై స్వల్ప వ్యవధిలో ఖవాజా(5), హారిస్‌(70; 141 బంతుల్లో 10 ఫోర్లు) పెవిలియన్‌ చేరడంతో ఆసీస్‌ 134 పరుగుల వద్ద మూడో వికెట్‌ను కోల్పోయింది. మరో 14 పరుగుల వ్యవధిలో ఇషాంత్‌ శర్మ బౌలింగ్‌లో హ్యాండ్స్‌ కోంబ్‌(7) ఔటయ్యాడు. కోహ్లి అద్భుతమైన క్యాచ్‌ పట్టడంతో హ్యాండ్స్‌ కోంబ్‌ పెవిలియన్‌ చేరాడు. ఆ తర్వాత షాన్‌ మార్ష్‌-ట్రావిస్‌ హెడ్‌ల జోడి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. వీరిద్దరి జోడి 84 జత చేసిన తర్వాత మార్ష్‌(45) ఐదో వికెట్‌గా ఔటయ్యాడు. అనంతరం ట్రావిస్‌ హెడ్‌(58) ఆరో వికెట్‌గా ఔటయ్యాడు. దీంతో తొలిరోజు ఆసీస్ 6 వికెట్లు కోల్పోయి 277 పరుగులు చేసింది.

1
43624
Story first published: Friday, December 14, 2018, 17:28 [IST]
Other articles published on Dec 14, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+