For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆసియా కప్: డ్రెస్సింగ్ రూమ్‌లో కేదార్ జాదవ్ డ్యాన్స్ (వీడియో)

Watch: This video of Kedar Jadhav dancing to ‘Churake Dil Mera’ is surely the most hilarious thing on internet today

హైదరాబాద్: ఆసియాకప్‌లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. టోర్నీలో వరుసగా పాకిస్థాన్‌పై రెండో విజయం సాధించడంతో భారత జట్టులోని ఆటగాళ్లు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సూపర్-4లో భాగంగా పాకిస్థాన్ జట్టుపై భారత్ విజయం సాధించిన రోజే అంబటి రాయుడు బర్త్ డే కూడా.

దీంతో అంబటి రాయుడిని కేక్‌లో ముంచెత్తిన ఆటగాళ్లు.. ఆ తర్వాత డ్రెస్సింగ్ రూమ్‌లోనూ తెగ ఎంజాయ్ చేశారు. ఎప్పుడూ హుందాగా వ్యవహారించే టీమిండియా ఆల్‌రౌండర్ కేదార్ జాదవ్.. తన డ్యాన్స్‌తో జట్టులోని ఆటగాళ్లను సైతం ఆశ్చర్యానికి గురి చేశాడు. డ్రెస్సింగ్ రూమ్‌లో రెచ్చిపోయి మరీ డ్యాన్స్ చేశాడు.

అక్షయ్‌కుమార్, శిల్పాశెట్టి నటించిన బాలీవుడ్ ఫేమస్ సాంగ్ 'చురాకె దిల్ మేరాపై' అతడు వేసిన స్టెప్పులు జట్టులోని సహచర ఆటగాళ్లను కడుపుబ్బా నవ్వించాయి. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సాంగ్ అనంతరం సల్మాన్‌ఖాన్ ఫేవరెట్ సాంగ్ 'ఒ ఒ జానె జానా' పాటకు కూడా డ్యాన్స్ చేసి అలరించాడు.

ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో ఓపెనర్లు రోహిత్‌ శర్మ (111 నాటౌట్‌), శిఖర్‌ ధావన్‌ (114) సెంచరీలతో రాణించడంతో పాక్‌పై భారత్‌ 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఫలితంగా రోహిత్ శర్న నేతృత్వంలోని టీమిండియా ఆసియా కప్ ఫైనల్లో ప్రవేశించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు చేసిన పాకిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్లకు 237 పరుగులు చేసింది.

అనంతరం భారత ఓపెనర్లు 210 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో పాక్ నిర్దేశించిన 237 పరుగుల లక్ష్యాన్ని భారత్ అలవోకగా ఛేదించగలిగింది. టోర్నీలో భాగంగా సూపర్-4లో టీమిండియా మంగళవారం ఆప్ఘనిస్థాన్‌తో తలపడనుంది. మరొవైపు బుధవారం బంగ్లాదేశ్‌-పాక్‌ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో పాక్ విజయం సాధిస్తే, ఫైనల్లో మరోసారి భారత్‌తో తలపడనుంది.

Story first published: Monday, September 24, 2018, 18:57 [IST]
Other articles published on Sep 24, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+