న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్ 2019: కోహ్లీకి వార్నింగ్ ఇచ్చిన ధోని (వీడియో)

Watch: The new IPL ad featuring Virat Kohli and MS Dhoni; Not CSK or RCB but humour is the winner here

హైదరాబాద్: మార్చి 23న ఐపీఎల్ 2019 సీజన్‌కు తెరలేవనుంది. ధోని నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో విరాట్ కోహ్లీ సారథ్యంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. దీంతో కోహ్లీ vs ధోనిగా జరిగే ఈ మ్యాచ్ కోసం ఎంతో మంది అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

<strong>ధోనిని తక్కువగా అంచనా వేయొద్దు: అభిమాని ట్వీట్‌కు క్లార్క్ రిప్లై</strong>ధోనిని తక్కువగా అంచనా వేయొద్దు: అభిమాని ట్వీట్‌కు క్లార్క్ రిప్లై

ఈ మ్యాచ్‌పై ఆసక్తి రేకెత్తించేందుకు గాను ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) తన ట్విట్టర్‌లో ఓ అద్భుతమైన వీడియాని అభిమానులతో పంచుకుంది. ఇందులో ఇరు జట్లకు చెందిన అభిమానులు ధోనీ, కోహ్లి అనుకుంటూ పోటీలు పడి నినాదాలు చేస్తున్నారు. చివర్లో ధోనీ, కోహ్లీ కూడా చాయ్ తాగుతూ.. మ్యాచ్‌లో చూసుకుందాం అంటూ సవాల్ విసురుకుంటారు.

వీడియో చివర్లో సరే అంటూ వెళ్లిపోతున్న ధోనీ.. లేట్‌గా రాకు అంటూ కోహ్లీకి వార్నింగ్ ఇవ్వడం వీడియోకే హైలైట్‌గా నిలిచింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఐపీఎల్ 2019 సీజన్ షెడ్యూల్‌ని బీసీసీఐ ఇటీవలే విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే కేవలం 17 మ్యాచ్‌లకు సంబంధించిన షెడ్యూల్‌ను మాత్రమే బీసీసీఐ ప్రకటించడం విశేషం.

మార్చి 23న టోర్నీ ప్రారంభం కానుంధి. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో తొలి రెండు వారాల షెడ్యూల్‌ను మాత్రం బోర్డు విడుదల చేయడం విశేషం. ఈ రెండు వారాల్లో మొత్తం 17 మ్యాచ్‌లు జరగనున్నాయి. మిగతా షెడ్యూల్‌ను లోక్‌సభ ఎన్నికల తర్వాత విడుదల చేసే అవకాశం ఉన్నట్లు బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది.

చెన్నై సూపర్ కింగ్స్ జట్టు
అట్టిపెట్టుకున్న ఆటగాళ్లు: మహేంద్ర సింగ్ ధోనీ, సురేశ్ రైనా, దీపక్ చాహర్, కేఎం ఆసిఫ్, కరణ్ శర్మ, ధ్రువ్ షోరే, డుప్లెసిస్, మురళీ విజయ్, రవీంద్ర జడేజా, సామ్ బిల్లింగ్స్, మిచెల్ శాంట్నర్, డేవిడ్ విల్లే, డ్వేన్ బ్రావో, షేన్ వాట్సన్, లుంగి ఎంగిడీ, ఇమ్రాన్ తాహిర్, కేదార్ జాదవ్, అంబటి రాయుడు, హర్భజన్ సింగ్, ఎన్ జగదీషన్, శార్దుల్ ఠాకూర్, మోను కుమార్, చైతన్య బిష్ణోయ్

వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లు: మోహిత్ శర్మ (రూ.5 కోట్లు), రుతురాజ్ గైక్వాడ్‌ (రూ.20 లక్షలు)

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
అట్టిపెట్టుకున్న ఆటగాళ్లు: విరాట్ కోహ్లి, ఏబీ డివిలియర్స్, పార్థీవ్ పటేల్, యజువేంద్ర చాహల్, వాషింగ్టన్ సుందర్, పవన్ నేగి, నాథన్ కౌల్టర్ నైల్, మొయన్ అలీ, మహ్మద్ సిరాజ్, కాలిన్ డి గ్రాండ్‌హోమ్, టిమ్ సౌథీ, ఉమేష్ యాదవ్, నవదీప్ సైనీ, కుల్వంత్ ఖేజ్రోలియా, మార్కస్ స్టోయినిస్,

వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లు: గురు కీరత్ సింగ్‌ (రూ.50 లక్షలు), షిమ్రాన్ హెట్మెయర్‌ (రూ.4.2 కోట్లు), దేవ్‌దత్ పడిక్కల్‌ (రూ.20 లక్షలు), శివమ్ దూబే (రూ.5 కోట్లు), హెన్రిక్ క్లాసేన్ (రూ.50 లక్షలు), హిమ్మత్ సింగ్‌ (రూ.65 లక్షలు), మిలింద్ కుమార్‌ (రూ.30 లక్షలు), ప్రయాస్ రాయ్ బర్మన్‌ (రూ.1.50 కోట్లు), అక్షదీప్ నాథ్‌(రూ.3.6 కోట్లు)

Story first published: Friday, March 15, 2019, 15:56 [IST]
Other articles published on Mar 15, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X