మెల్‌బోర్న్: భారత్-పాకిస్థాన్ మ్యాచ్ సందర్భంగా కరాచి అభిమాని 'టపాకాయల' ప్రకటన ఎంత సందడి చేసిందో తెలిసిందే! భారత్‌పై ఒక్క విజయమూ లేక 1992లో తెచ్చుకున్న పటాకులు 2011లోనైనా పేల్చే చాన్స్ రాని పాక్ అభిమాని 'కబ్ ఫోడేంగే యార్' అంటూ నిర్వేదానికి గురవ్వడాన్ని ఇప్పటికే చూశాం.

కాగా, ఇప్పుడు ఫిబ్రవరి 22న దక్షిణాఫ్రికాతో మ్యాచ్ నేపథ్యంలో మరో ప్రకటన అలరిస్తోంది. ప్రపంచ కప్‌లో దక్షిణాఫ్రికాతో ఆడిన మూడుసార్లూ (1992, 1999, 2011) భారత జట్టు పరాజయం పాలైంది. మొదటి యాడ్‌లోనేమో పాక్ అభిమాని నిరాశనిస్పృహలకు లోనవుతాడు. ఈ యాడ్ కాస్త డిఫరెంట్.
<center><iframe width="100%" height="340" src="https://www.youtube.com/embed/nDN5_Negbkw" frameborder="0" allowfullscreen></iframe></center>
భారత అభిమానిలో స్ఫూర్తినింపేలా రూపొందించారు. దక్షిణాఫ్రికాతో మ్యాచ్ గెలిచితీరాలనే ఆకాంక్షతో టీమ్ ఇండియా జెర్సీలు ధరించిన టీనేజర్లు ఆసక్తిగా మ్యాచ్ చూస్తుంటారు. అంతలో తలుపు చప్పుడవుతుంది. తలుపు తీసిన ఓ కుర్రాడు.. నిండుగా పటాకులున్న కాటన్‌తో ఉన్న ఇద్దరు దక్షిణాఫ్రికన్లను చూసి ఆశ్చర్యపోతాడు.
ఆ కుర్రాడు తేరుకుని ఖుషీ అయ్యేంతలోపే ఆ పటాకుల కాటన్‌ను అతని చేతిలో పెట్టి మోఖా మోఖా అంటూ పాడుతూ వెళ్లిపోతారు. మరి పటాకులు పేల్చే అవకాశం భారత అభిమానులకు టీమిండియా ఆటగాళ్లు ఇస్తారో లేదో ఫిబ్రవరి 22 వరకు వేచి చూడాల్సిందే.