Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

భారత ఆర్మీ ఏంచేసిందో!: మ్యాచ్ మధ్యలో ఆటోలో డ్రింక్స్ (వీడియో)

WATCH: The Bharat Army uses auto rickshaw to deliver drinks during cricket match, urges BCCI to take notes

లండన్: క్రికెట్‌కు పుట్టినిల్లు ఇంగ్లాండ్‌. ప్రస్తుతం కోహ్లీసేన సుదీర్ఘ పర్యటన కోసం ఇంగ్లాండ్‌లో పర్యటిస్తోంది. ఈ పర్యటనలో భాగంగా ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో తొలి టెస్టు ఎడ్జ్ బాస్టన్ వేదికగా జరిగింది. ఈ టెస్టులో ఆతిథ్య ఇంగ్లాండ్ 31 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

1
42375
కోహ్లీసేనను ప్రోత్సహించిన భారత ఆర్మీ

కోహ్లీసేనను ప్రోత్సహించిన భారత ఆర్మీ

ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఇంగ్లాండ్ జట్టును బార్మీ ఆర్మీ ప్రోత్సహించగా... భారత జట్టుని భారత ఆర్మీ ప్రోత్సహించింది. క్రికెట్‌కు పుట్టినిల్లు అయిన ఇంగ్లాండ్‌లో ఈ క్రీడను అక్కడి అభిమానులు అమితంగా ప్రేమిస్తారు. మ్యాచ్‌లు జరిగే సమయంలో తమ జట్లను వెన్నంటి ఉండి ప్రోత్సహిస్తారు.

భారత ఆర్మీ పేరిట క్రికెట్ ఫ్యాన్ క్లబ్

భారత ఆర్మీ పేరిట క్రికెట్ ఫ్యాన్ క్లబ్

భారత్‌కు చెందిన ఎన్నారైలు ఇంగ్లాండ్‌లో స్థిరపడి అక్కడ భారత ఆర్మీ అనే క్రికెట్ ఫ్యాన్ క్లబ్‌ను ఏర్పాటు చేశారు. ఈ క్లబ్ ముఖ్య ఉద్దేశం ఇంగ్లాండ్ వేదికగా భారత్‌కు చెందిన జట్లు మ్యాచ్‌లు ఆడే సమయంలో ప్రోత్సహించడం. ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా భారత్‌-ఇంగ్లాండ్‌ మధ్య జరిగిన తొలి టెస్టుకు భారత్‌ ఆర్మీ హాజరై కోహ్లీ సేనను ప్రోత్సహించింది.

 ఆటోలో ఆటగాళ్లకు కూల్‌డ్రింక్స్‌ తీసుకెళ్లిన భారత ఆర్మీ

ఆటోలో ఆటగాళ్లకు కూల్‌డ్రింక్స్‌ తీసుకెళ్లిన భారత ఆర్మీ

తాజాగా, ఈ భారత ఆర్మీ ఏం చేసిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఆటగాళ్లకు ఆటోలో డ్రింక్స్ తీసుకెళ్లి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇంగ్లాండ్‌లో ఓ లోకల్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది. టోర్నీలో భాగంగా భారత ఆర్మీ బృందం ఆటోలో ఆటగాళ్లకు కూల్‌డ్రింక్స్‌ తీసుకెళ్లి ఇచ్చేందుకు ముందుగానే అనుమతి తీసుకున్నారు.

డ్రింక్స్ బ్రేక్‌లో మైదానంలోకి దూసుకొచ్చిన ఆటో

మ్యాచ్ మధ్యలో డ్రింక్స్ బ్రేక్ వచ్చింది. ఇంతలో ఒక ఆటో మైదానంలోకి దూసుకువచ్చింది. గ్యాలరీలో కూర్చుని మ్యాచ్‌ వీక్షిస్తున్న వారికి ముందుగా ఏం జరుగుతుందో తెలియలేదు. ఆ తర్వాత ఆటోలో వచ్చిన వారు ఆటగాళ్లకు డ్రింక్స్‌ అందజేయడం ఆ తర్వాత తిరిగి వెనక్కి రావడంతో విషయం అర్థమైంది. ఆటోలో ఆటగాళ్లకు డ్రింక్స్‌ అందించిన వీడియోను భారత్‌ ఆర్మీ బృందం సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Story first published: Tuesday, August 7, 2018, 13:03 [IST]
Other articles published on Aug 7, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+