For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రజనీ 'కాలా'గా ధోని: సోషల్ మీడియాలో వీడియో వైరల్

By Nageshwara Rao
Watch: Thala MS Dhoni as Rajinikanth in Kaala teaser is the only Monday motivation you need

హైదరాబాద్: సూపర్ స్టార్‌ రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం కాలా. కబాలి ఫేం పా రంజిత్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ ఇటీవల విడుదలై యూట్యూబ్‌లో సంచలనం సృష్టిస్తోంది. రెండేళ్ల నిషేధం తర్వాత ధోని నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఈ ఏడాది పునరాగమనం చేస్తోన్న సంగతి తెలిసిందే.

ఈ నేఫథ్యంలో ఈ టీజర్‌ను చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు ఎడిట్‌ చేసి ధోనిని కాలాగా చూపిస్తూ టీజర్‌‌ను రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ టీజర్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ధోని ఆడిన గత మ్యాచ్‌లు, పలు సందర్భాల్లో ధోని పాల్గొన్న ప్రెస్‌ మీట్లు, కొన్ని యాడ్‌ కోసం ధోని యాక్ట్‌ చేసిన సన్నివేశాలతో ఈ టీజర్‌ను ఎడిట్‌ చేశారు.

ఈ వీడియోలో బ్యాక్‌ గ్రౌండ్‌ మ్యూజిక్‌, డైలాగ్స్‌ అన్ని చక్కగా కుదిరాయి. లిప్ సింక్ కూడా అవడంతో ఈ వీడియోని అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు. ఈ వీడియోలో కపిల్‌ దేవ్‌, ప్రియాంక చోప్రా కూడా కనిపించారు. ఇదిలా ఉంటే రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన కాలా ఏప్రిల్‌ 27న విడుదల కానుంది. ఈ సినిమాకి నిర్మాతగా రజనీ అల్లుడు ధనుష్ వ్యవహారిస్తున్నారు.

Story first published: Tuesday, March 6, 2018, 18:12 [IST]
Other articles published on Mar 6, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+