పెర్త్: స్వదేశంలో దక్షిణాఫ్రికాతో పెర్త్‌లోని వాకా స్టేడియంలో జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా ఓటమి పాలైంది. 439 పరుగల విజయ లక్ష్యాన్ని చేధించే క్రమంలో ఆస్ట్రేలియా 177 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఇదిలా ఉంటే తొలి టెస్టులో దక్షిణాఫ్రికా ఆటగాడు బావుమా అద్భుతమైన డైవ్ చేసి వార్నర్‌ని రనౌట్ చేయడం మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచింది.
ఆస్ట్రేలియా Vs దక్షిణాఫ్రికా టెస్టు స్కోరు కార్టు
నాలుగో రోజు ఆటలో భాగంగా ఆదివారం ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో ఓపెనర్ డేవిడ్ వార్నర్ పరుగు కోసం యత్నించాడు. అదే బావుమా బౌలర్ ఎండ్ నుంచి పరుగెత్తుకొచ్చిన బావుమా బంతిని అందుకుని అంతే వేగంగా వికెట్లవైపుకు విసిరాడు. దాంతో బెయిల్స్ కిందపడటంతో వార్నర్ రనౌట్‌గా వెనుదిరిగాడు.

వార్నర్ సులువుగా క్రీజులోకి వెళతాడని అందరూ భావించారు. అయితే రెప్పపాటులో బావుమా చేసిన రనౌట్‌తో వార్నర్ సైతం ఆశ్చర్య పోయాడు. వార్నర్‌ను రనౌట్ చేయడానికి పట్టిన సమయం 0.264 సెకండ్లుగా నమోదైంది. ఈ ఫీల్డింగ్‌ను చూస్తే దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ జాంటీ రోడ్స్‌ని గుర్తుకు తెచ్చాడు.
కాగా ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఓటమి పాలైంది. 169/4 ఓవర్ నైట్ స్కోరుతో చివరిరోజు ఆట ప్రారంభించిన ఆస్ట్రేలియా 361 పరుగులకే ఆలౌటైంది. ఆస్ట్రేలియాలో ఉస్మాన్ ఖవాజా(97) బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడిన జట్టు ఓటమి నుంచి తప్పించలేకపోయాడు.
ఐదో రోజైన సోమవారం 195 పరుగుల వద్ద మిచెల్ మార్ష్(26) రూపంలో ఆస్ట్రేలియా ఐదో వికెట్‌ను కోల్పోయింది. ఆ తర్వాత నేవిల్‌తో కలిసి ఖవాజా ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే యత్నం చేశాడు. వీరిద్దరూ కలిసి ఆరో వికెట్‌కు 50 పరుగులు జోడించారు. అనంతరం ఖవాజా పెవిలియన్‌కు చేరాడు.
చివర్లో నేవిల్(60 నాటౌట్)తో అజేయంగా నిలిచాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో రబడా ఐదు వికెట్లు సాధించగా, ఫిలిండర్, డుమనీ, బావుమా, మహారాజ్‌లు తలో వికెట్ తీసుకున్నారు.