Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

భారత జట్టులో చెత్త డ్యాన్సర్ ఎవరు?: రోహిత్ శర్మ సమాధానమిది! (వీడియో)

ICC World Cup 2019: Rohit Sharma Reveals Secrets Of Team India Players | Oneindia Telugu
Watch: Team Indias Worst Dancer According To Rohit Sharma

హైదరాబాద్: భారత జట్టులో చెత్త డ్యాన్సర్ ఎవరో తెలుసుకోవాలంటే ఈ క్రింది వీడియోని మీరు చూడాల్సిందే. మే30 నుంచి ఇంగ్లాండ్ వేదికగా వన్డే వరల్డ్‌కప్ ఆరంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ వరల్డ్ కప్ కోసం కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా గత వారమే ఇంగ్లాండ్‌కు చేరుకుంది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ఈ టోర్నీలో టీమిండియా వైస్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ వ్యవహారిస్తున్నాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో ఉన్న రోహిత్ శర్మ ఐసీసీ అడిగిన కొన్ని ప్రశ్నలకు ఆసక్తికరంగా సమాధానాలు ఇచ్చాడు. ఈ సందర్భంగా భారత జట్టులో చెత్త డ్యాన్సర్ ఎవరిని అడిగిన ప్రశ్నకు రోహిత్ శర్మ ఏ మాత్రం ఆలోచించకుండా హార్థిక్ పాండ్యా అని సమాధానమిచ్చాడు.

దీంతో పాటు ఓపెనర్ శిఖర్ ధావన్‌ను 'వరస్ట్ రూమ్‌మేట్' అని చెప్పుకొచ్చాడు. ధావన్ శుభ్రంగా ఉండడని అందుకే అతనితో ఉండాలంటే కాస్త ఇబ్బందిగా ఉంటుందని రోహిత్ శర్మ తెలిపాడు. జట్టులో ఏ ఆటగాడు తన గురించి తానే ఎక్కువగా గూగుల్‌లో వెతుకుతాడు అని అడగ్గా అందుకు సమాధానంగా హార్థిక్ పాండ్యా అని రోహిత్ చెప్పాడు.

టీమిండియా బ్యాటింగ్ కోచ్ సంజయ్ భంగార్ బస్సు ఎక్కేందుకు చాలా ఆలస్యంగా వస్తారని రోహిత్ శర్మ వెల్లడించాడు. కాగా, వరల్డ్ కప్‌కు ముందు న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వార్మప్ మ్యాచ్‌లో భారత్ ఘోరంగా ఓటమిపాలైంది. దీంతో మంగళవారం బంగ్లాతో జరిగే రెండో వార్మప్ ‌మ్యాచ్‌లో గెలవాలనే పట్టుదలతో ఉంది.

Story first published: Monday, May 27, 2019, 18:34 [IST]
Other articles published on May 27, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+