Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

చీకూ అక్కడ ఇద్దరు ఫీల్డర్లను ఉంచు: స్టంప్ మైక్‌లో ధోని వాయిస్

హైదరాబాద్: మహేంద్ర సింగ్ ధోని తన కెప్టెన్సీకి వీడ్కోలు పలికినప్పటికీ భారత జట్టులోని ఆటగాళ్లు మాత్రం ఇప్పటికీ తమ కెప్టెన్ ధోనియే అంటున్నారు. అలా ఆటగాళ్లు చెప్పడంలో తప్పులేదు. ఎందుకంటే కెప్టెన్సీ నుంచి తప్పుకున్నా... ధోని మాత్రం ఇప్పటికీ కెప్టెన్‌‌లానే మైదానంలో ఫీల్డింగ్ సెట్ చేసి, బౌలర్లకి సూచనలు చేస్తుంటాడు.

 లాథమ్‌ని అవుట్ చేసేందుకు ధోని వ్యూహం

లాథమ్‌ని అవుట్ చేసేందుకు ధోని వ్యూహం

మూడు వన్డేల సిరిస్‌లో భాగంగా ఆదివారం వాంఖడె స్టేడియంలో జరిగిన తొలి వన్డేలో స్వీప్, రివర్స్ స్వీప్‌లతో సెంచరీని నమోదు చేసి టామ్ లాథమ్ కివీస్ విజయంలో కీలకపాత్ర పోషించిన సంగిత తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండో వన్డేలో టామ్ లాథమ్‌ని అవుట్ చేసేందుకు ధోని వ్యూహం రచించాడు.

 స్టంప్‌ మైక్‌లో రికార్డు అయిన ధోని వాయిస్

స్టంప్‌ మైక్‌లో రికార్డు అయిన ధోని వాయిస్

ఇందులో భాగంగా కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు భారత బౌలర్లకి ధోని సూచనలిస్తున్న మాటలు కొన్ని స్టంప్‌ మైక్‌లో రికార్డు అయ్యాయి. అందులో మిడ్ వికెట్, స్కైర్ లెగ్ దిశగా ఇద్దరు లేదా ముగ్గురు ఫీల్డర్లని ఉంచాలంటూ సూచనలు ధోని సూచనలు చేశాడు. అంతేకాదు కేదార్ జాదవ్ బౌలింగ్ చేస్తున్న సమయంలో టామ్‌ లాథమ్‌కి ఎటువంటి బంతులు వేయాలో కూడా హిందీలో చెప్పాడు.

 జాదవ్ బౌలింగ్‌లో హిందీలో సూచనలు

జాదవ్ బౌలింగ్‌లో హిందీలో సూచనలు

రెండో వన్డేలో 8 ఓవర్లు వేసిన కేదార్ జాదవ్ 3.87 ఎకానమీతో 31 పరుగులు ఇచ్చాడు. కివీస్ ఆటగాళ్లకి అర్థం కాకుండా ఉండేందుకే ధోని హిందీలో సూచనలు చేశాడు. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 230 పరుగులు చేసింది.

 కాన్పూర్ వేదికగా ఆదివారం మూడో వన్డే

కాన్పూర్ వేదికగా ఆదివారం మూడో వన్డే

అనంతరం స్వల్ప లక్ష్యంతో బరిలోగి దిగిన టీమిండియా మరో 4 ఓవర్లు మిగిలుండగానే లక్ష్యాన్ని చేధించింది. దీంతో ఈ మ్యాచ్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. దీంతో మూడు వన్డేల సిరిస్ 1-1తో సమమైంది. సిరిస్ విజేత ఎవరో తేల్చే మూడో వన్డే ఆదివారం (అక్టోబర్ 29)న కాన్పూర్ వేదికగా జరగనుంది.

Story first published: Monday, November 13, 2017, 12:17 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+