For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వార్నర్ ఔట్: రాజస్థాన్ విజయానికి కారణమైన స్మిత్ స్టన్నింగ్ క్యాచ్ (వీడియో)

IPL 2019 : Steve Smith Takes Stunner To Dismiss David Warner || Oneindia Telugu
Watch: Steve Smith Takes Stunner To Dismiss David Warner But Suffers Injury Scare

హైదరాబాద్: ప్లేఆఫ్‌ ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ అద్భుత విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. జైపూర్ వేదికగా శనివారం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 160 పరుగులు చేసింది.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

మెరుపు ఇన్నింగ్స్ ఆడిన పాండే, డేవిడ్‌ వార్నర్‌

మనీశ్‌ పాండే, డేవిడ్‌ వార్నర్‌ మెరుపులతో 12 ఓవర్లు ముగిసేసరికి 103/1తో పటిస్థితిలో నిలిచింది. ఇంకా చేతిలో 9 వికెట్లు ఉండటంతో సన్‌రైజర్స్ భారీ స్కోరు చేస్తుందని అంతా భావించారు. అయితే, రాజస్థాన్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఓ అద్భుతమైన క్యాచ్‌ పట్టి దూకుడుగా ఆడుతోన్న సన్‌రైజర్స్ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌ను పెవిలియన్‌కు పంపాడు.

వరుసగా మూడో ఐపీఎల్‌నూ 600 పరుగులు

వరుసగా మూడో ఐపీఎల్‌నూ 600 పరుగులు

కాగా, డేవిడ్ వార్నర్ వరుసగా ఆడిన మూడో ఐపీఎల్‌నూ 600 పరుగులు పూర్తి చేశాడు. ఒంటిచేత్తో క్యాచ్‌ పట్టినప్పుడు అతని కుడిచేతికి గాయం కూడా అయింది. వార్నర్ ఔటైన తర్వాత సన్‌రైజర్స్‌ను తక్కువ స్కోరుకే కట్టడి చేయడంలో రాజస్థాన్ బౌలర్లు విజయం సక్సెస్ అయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.

నొప్పితో విలవిల్లాడని స్టీవ్ స్మిత్ c

నొప్పితో విలవిల్లాడని స్టీవ్ స్మిత్ c

అయితే, తన నొప్పి గురించి పెద్దగా ఆందళన చెందాల్సిన అవసరం లేదని మ్యాచ్‌ అనంతరం స్టీవ్ స్మిత్‌ వెల్లడించాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ జట్టులో మనీశ్ పాండే 36 బంతుల్లో 61(9 ఫోర్లు) వరుసగా రెండో హాఫ్ సెంచరీతో రాణించగా నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లకు 160 పరుగులు చేసింది.

ప్లేఆఫ్ బరిలోనే రాజస్థాన్

ప్లేఆఫ్ బరిలోనే రాజస్థాన్

రాయల్స్ బౌలర్లలో ఉనాద్కట్, థామస్, గోపాల్, అరోన్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం రాజస్థాన్ జట్టులో ఓపెనర్లు లివింగ్‌స్టోన్ 26 బంతుల్లో 44 (4 ఫోర్లు, 3 సిక్సర్లు), రహానే 34 బంతుల్లో 39(4 ఫోర్లు, 1 సిక్స్)తో పాటు సంజూ శాంసన్ 32 బంతుల్లో 48 నాటౌట్(4 ఫోర్లు, 1 సిక్స్) రాణించడంతో 19.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసింది.

Story first published: Monday, April 29, 2019, 14:54 [IST]
Other articles published on Apr 29, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+