స్టీవ్ స్మిత్ డ్రోన్‌కు చిక్కిన ధోని భారీ సిక్స్ (వీడియో)
హైదరాబాద్: రైజింగ్ పుణె సూపర్ జెయింట్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ ప్రాక్టిస్ సెషన్‌లో డ్రోన్‌తో భలేగా సందడి చేశాడు. ఐపీఎల్ పదో సీజన్ ప్రారంభానికి ముందు పూణె ప్రాంఛైజీ యాజమాన్యం ధోనీని తప్పించి స్మిత్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే.
ఆ తర్వాత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనితో కొత్త కెప్టెన్ స్టీవ్ స్మిత్ బాగా కలిసిపోయాడు. మ్యాచ్‌ల్లో ధోని నుంచి సలహాలు సూచనలు తీసుకుంటున్న వైనాన్ని మనం చూశాం. అయితే తాజాగా వీరిద్దరూ సరదాగా గడిపిన దృశ్యాల్ని స్మిత్ సోషల్ మీడియా ద్వారా పంచుకొన్నాడు.

తన డ్రోన్ కెమెరాతో ధోని బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న దృశ్యాలను డ్రోన్‌తో చిత్రీకరించి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. తన డ్రోన్‌తో ధోని బాదిన ఓ భారీ సిక్సర్‌నూ చిత్రీకరించాడు. 'నేనూ నా కొత్త హాబీ. నా కొత్త డ్రోన్ ఎగురుతుంటే ఎంతో ఇష్టం. ధోనీ భారీ సిక్స్‌నూ పట్టింది' అని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు.
ఆ సమయంలో ధోని కూడా డ్రోన్‌ను గమనిస్తూ ఉల్లాసంగా కనిపించాడు. ఐపీఎల్ ప్రారంభంలో అపజయాలను ఎదుర్కొన్న పూణె ప్రస్తుతం వరుస విజయాలను నమోదు చేస్తోంది. ఈ సీజన్‌లో 12 మ్యాచుల్లో 8 గెలిచి 16 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతోంది.
శుక్రవారం ఢిల్లీతో, ఆదివారం కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో తలపడనుంది. ఈ రెండింట్లో ఒక్క మ్యాచ్ నెగ్గితే రైజింగ్ పూణె సూపర్ జెయింట్ ప్లేఆఫ్ చేరుకుంటుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications