హైదరాబాద్: భారత్ క్రికెట్‌తో పాటు ప్రపంచ క్రికెట్‌లో తనదైన ముద్రను వేసిన మహేంద్ర సింగ్ ధోని సిగ్నేచర్‌ను ఎవరూ చెరిపేయలేరు. ఈ విషయం తెలియక రైజింగ్ పూణె సూపర్ జెయింట్ ప్రాంఛైజీ యజమానులకు తెలియక కెప్టెన్సీ నుంచి ధోనిని తప్పించి ఉండొచ్చు.
ఐపీఎల్ ప్రత్యేక వార్తలు | ఐపీఎల్ పాయింట్ల పట్టిక | ఐపీఎల్ 2017 ఫోటోలు
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అయినా, పూణె కెప్టెన్ స్టీవ్ స్మిత్ వీరికి ధోని కెప్టెన్సీ గురించి తెలుసు. అందుకేనేమో మ్యాచ్‌లో కీలక సందర్భాల్లో ధోని సలహా తీసుకునేందుకు ఏ మాత్రం తడబడటం లేదు.
తాజాగా ఐపీఎల్ పదో సీజన్‌లో ముంబై, పుణె మ్యాచ్ సందర్భంగానూ నరాలు తెగే ఉత్కంఠలో పూణె కెప్టెన్ స్మిత్.. ధోని వైపు చూశాడు. అతని దగ్గరికి వెళ్లి ఏం చేయాలో అడిగాడు. టోర్నీకి ముందు జట్టులోని సీనియర్ ప్లేయర్స్ అభిప్రాయాలు తీసుకోనని చెప్పిన స్మిత్, ధోని వద్దకు వెళ్లి సలహా తీసుకున్నాడు.
19వ ఓవర్ ఎవరికి ఇవ్వాలో ఆ సమయంలో చర్చించామని మ్యాచ్ అనంతరం రహానే చెప్పాడు. శార్దూల్, జైదేవ్‌లలో ఎవరికివ్వాలో తెలియక స్మిత్ తికమక పడుతుంటే.. ధోనీ మాత్రం జైదేవ్‌వైపే మొగ్గు చూపాడని రహానే అన్నాడు. జైదేవ్ స్లో బాల్స్ వేయడంలో దిట్ట కావడంతో రోహిత్‌ను బోల్తా కొట్టించేందుకు అతనే సరైనవాడని ధోని చెప్పినట్లు రహానే వెల్లడించాడు.
161 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్‌కు చివరి రెండు ఓవర్లలో 24 పరుగులు చేయాల్సి వచ్చింది. క్రీజులో రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా ఉండటంతో ముంబై గెలుస్తుందనే అంతా భావించారు. అయితే పూణె వ్యూహాలు ఫలించి, చివరికి పూణె 3 పరుగులతో గెలిచింది.