For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

చూసుకునే పని లేదా?: స్టోయినిస్ రనౌట్‌పై స్మిత్ అసహనం (వీడియో)

WATCH: Steve Smith And Marcus Stoinis Land At The Same End Due To A Ridiculous Misunderstanding


హైదరాబాద్: లార్డ్స్ వేదికగా మంగళవారం ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆల్ రౌండర్ మార్కస్ స్టొయినిస్‌ రనౌట్‌ అయిన తీరుపై ఆసీస్ అభిమానులు మండిపడుతున్నారు. నాన్‌స్ట్రైక్‌లో ఉన్న స్టీవ్‌ స్మిత్‌ సంకేతాలను ఏమాత్రం పట్టించుకోకుండా తొందరపడ్డాడని, లేని పరుగు కోసం యత్నించి స్టోయినిస్ రనౌట్ అయ్యాడని సోషల్ మీడియాలో విమర్శిస్తున్నారు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

రషీద్‌ వేసిన 42వ ఓవర్‌ ఐదో బంతిని

రషీద్‌ వేసిన 42వ ఓవర్‌ ఐదో బంతిని

ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌‌లో అదిల్‌ రషీద్‌ వేసిన 42వ ఓవర్‌ ఐదో బంతిని స్టీవ్‌ స్మిత్‌ లాంగాఫ్‌ వైపు కొట్టి సింగిల్‌ తీసే ప్రయత్నం చేశాడు. అయితే మరో ఎండ్‌లో ఉన్న స్టొయినిస్‌ రెండో పరుగు కోసం పరిగెత్తాడు. అయితే, బంతి ఫీల్డర్ చేతిలోకి వెళ్లడాన్ని చూసిన స్టీవ్ స్మిత్‌ క్రీజుకు దగ్గర్లోనే ఆగిపోయాడు. దీనిని గమనించకుండా స్టోయినిస్ రెండో ఎండ్‌కు చేరుకున్నాడు.

కీపర్‌ బట్లర్‌కు అందించడంతో

అదే సమయంలో బెయిర్‌ స్టో బంతిని అందుకొని కీపర్‌ బట్లర్‌కు అందించడంతో స్టొయినిస్‌ రనౌట్‌గా వెనుదిరిగాడు. క్రీజులో బ్యాటింగ్‌ చేస్తున్న స్టీవ్ స్మిత్‌తో పాటు డగౌట్‌లో ఉన్న ఆసీస్ కెప్టెన్ ఆరోన్‌ ఫించ్‌ కూడా స్టొయినిస్‌ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

64 పరుగుల తేడాతో ఆసీస్ విజయం

64 పరుగుల తేడాతో ఆసీస్ విజయం

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 285 పరుగులు చేసింది. అనంతరం 286 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్‌ 44.4 ఓవర్లలోనే 221 పరుగులకి ఆలౌటైంది. దీంతో ఆస్ట్రేలియా 64 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది.

12 పాయింట్లతో ఆసీస్ అగ్రస్థానంలో

12 పాయింట్లతో ఆసీస్ అగ్రస్థానంలో

ఈ విజయంతో ఆస్ట్రేలియా సెమీస్‌కు అర్హత సాధించింది. దీంతో ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్‌కప్‌లో సెమీఫైనల్‌కు అర్హత సాధించిన మొదటి జట్టుగా ఆస్ట్రేలియా నిలిచింది. ఈ ప్రపంచకప్‌లో ఇప్పటివరకు ఆస్ట్రేలియా ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో ఆరింట విజయం సాధించి 12 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో ఉంది. ఆసీస్ ఓడిన ఒకే ఒక మ్యాచ్ కోహ్లీసేన చేతిలోనే కావడం విశేషం.

Story first published: Wednesday, June 26, 2019, 13:03 [IST]
Other articles published on Jun 26, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+