Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నెట్ ప్రాక్టీసుతో చెమట చిందిస్తున్న ధోనీ.. కోహ్లీ (వీడియో)

Watch: Sri Lankas Kusal Perera Stretchered Off After Nasty Collision With Advertising Hoarding

హైదరాబాద్: ప్రపంచంలో ప్రఖ్యాతి ఘడించిన దేశీవాలీ లీగ్ ఐపీఎల్ అయిపోవడంతోనే బీసీసీఐ ముందుగా నిర్దేశించిన ప్రణాళిక ప్రకారం విదేశీ పర్యటన పూనుకుంది. ఈ నేపథ్యంలో ముందుగా ఐర్లాండ్‌తో జరగబోయే రెండు టీ20ల సిరీస్ కోసం ప్రాక్టీస్ మొదలుపెట్టింది టీమిండియా. డబ్లిన్‌లోని ద విలేజ్ స్టేడియంలో బుధవారం తొలి టీ20 మ్యాచ్ జరగనున్న సందర్భంగా కోహ్లి సేన నెట్స్‌లో చెమటోడ్చింది. కెప్టెన్ కోహ్లితోపాటు మాజీ కెప్టెన్ ధోనీ, రైనా నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించారు.

ఈ ప్రాక్టీస్‌కు సంబంధించిన వీడియోను బీసీసీఐ తమ ట్విటర్ అకౌంట్‌లో పోస్ట్ చేసింది. ఈ రెండు టీమ్స్ 9 ఏళ్ల కిందట ఒకే ఒక్కసారి టీ20 మ్యాచ్‌లో తలపడ్డాయి. ఇండియా ఈ సిరీస్‌కు ఫేవరెట్‌గా బరిలోకి దిగుతున్నా.. ఐర్లాండ్‌ను ఏమాత్రం తేలిగ్గా తీసుకోకూడదని కోహ్లి సేన భావిస్తున్నది. రానున్న రోజుల్లో ఐర్లాండ్‌తో రెండు, ఇంగ్లండ్‌తో మూడు టీ20లు ఆడనుంది టీమిండియా.

దీంతో నెట్స్‌లో బ్యాట్స్‌మెన్ అందరూ భారీ షాట్లు ఆడటానికి ప్రయత్నించారు. ఈ మ్యాచ్‌కు ముందు ఓ రికార్డు కెప్టెన్ కోహ్లిని ఊరిస్తుంది. టీ20ల్లో రెండు వేల పరుగులకు మరో 17 పరుగుల దూరంలో కోహ్లి ఉన్నాడు. అత్యంత వేగంగా ఈ మైల్‌స్టోన్ అందుకున్న ప్లేయర్‌గా కోహ్లి నిలవనున్నాడు. అతని కంటే ముందు న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ బ్రెండన్ మెకలమ్, మార్టిన్ గప్టిల్ రెండు వేల పరుగుల క్లబ్‌లో ఉన్నారు.

కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా సుదీర్ఘ పర్యటనలో తొలుత ఐర్లాండ్ పర్యటన కోసం శనివారం.. బయల్దేరినా అటు నుంచి నేరుగా ... ఇంగ్లాండ్‌ పర్యటన కోసం బయల్దేరనుంది. శనివారం టీమిండియా బయల్దేరింది. ఈ సుదీర్ఘ సిరిస్‌లో భాగంగా కోహ్లీసేన తొలుత జూన్ 27, 29న ఐర్లాండ్‌‌తో రెండు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌ ఆడనుంది. ఇందుకోసం భారత జట్టులోని ఆటగాళ్లు ఐర్లాండ్‌ పర్యటనకు బయల్దేరారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను బీసీసీఐ తన ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకుంది.

Story first published: Tuesday, June 26, 2018, 15:23 [IST]
Other articles published on Jun 26, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+